BJP: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD)లో ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో రెండుసార్లు ఎమ్మెల్యే, పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజేష్ గుప్తా బీజేపీలో చేరారు. దీంతో,ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
Union Cabinet: ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఢిల్లీ పేలుళ్లను ఉగ్రవాద సంఘటనగా గుర్తించి, కేబినెట్ సమావేశంలో బాధితులకు నివాళులర్పించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం.. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని మంత్రి వర్గం రెండు నిమిషాలు మౌనం పాటించింది.
PM Modi: ప్రధాని భూటాన్ నుంచి తిరిగి వచ్చారు. దేశ రాజధానిలో అడుగు పెట్టిన వెంటనే పేలుడులో గాయపడిన వారిని పరామర్శించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఇప్పటికే దాదాపు 100 మంది ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ పేలుళ్లపై…
ఢిల్లీ కారు బాంబ్ పేలుడు తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు మార్మోగుతోంది. ఢిల్లీ బ్లాస్ట్‌లో పాల్గొన్న అనుమానిత వైద్యులు అల్ ఫలాహ్‌లోనే పని చేస్తున్నారు. పట్టుబడ్డ వైద్యులు.. యూనివర్సిటీలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీపై అనేక కథనాలు వెలువడుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వెంటాడుతోంది. గాలి నాణ్యత కోల్పోవడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్య నియంత్రణ కోసం కృత్రిమ వర్షాన్ని కురిపించాలని ఢిల్లీ ప్రభుత్వం పూనుకుంది. ఇందుకోసం రూ.3.21 కోట్లు కేటాయించింది.
ఢిల్లీ మెట్రో రెజ్లింగ్ అరేనాగా మారింది. ఇద్దరు ప్రయాణికులు డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలో ఫైటింగ్‌కు దిగారు. కిక్కిరిసి వెళ్తున్న కోచ్‌లో సడన్‌గా ఇద్దరు ప్యాసింజర్స్ కొట్లాటకు దిగారు. ఇద్దరూ కూడా ఒకకినొకరు తన్నుకోవడం.. కొట్టుకోవడం కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
India's Biggest Digital Arrest Scam: గత కొన్ని ఏళ్లుగా దేశవ్యాప్తంగా అనేక డిజిటల్ అరెస్టు కేసులు వెలుగులోకి వచ్చాయి. కానీ తాజాగా భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ కేసు ఢిల్లీలో వెలుగు చూసింది. ఈ కేసు పోలీసులను, దర్యాప్తు సంస్థలను కూడా ఆశ్చర్యపరిచింది. దక్షిణ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్‌లో నివసించే రిటైర్డ్ బ్యాంకర్ నరేష్ మల్హోత్రా దీనికి బలయ్యాడు. ఈ వృద్ధుడిని ఏకంగా నెలకు పైగా అరెస్టు చేశారు. అతడు జీవితాంతం పొదుపు చేసిన 23…
Delhi Murder: దేశ రాజధానిలో ఘోరం వెలుగుచూసింది. ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 17లో ఓ వ్యక్తి తన అత్తను, భార్యను కత్తెరతో హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. కుమార్తె పుట్టినరోజున వచ్చిన బహుమతి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో నిందితుడు తన భార్య, అత్తగారిని కత్తెరతో హత్య చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తెరలను స్వాధీనం చేసుకున్నట్లు…
Gang Rape: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలు ( 9,12 ఏళ్ల వయస్సు) ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్‌లో గ్యాంగ్‌రేప్‌కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి బోర్డు పరీక్షలో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల 1200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందించాలని నిర్ణయించింది. ఒలింపిక్స్, ఆసియాడ్, కామన్వెల్త్ క్రీడల వంటి అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు, అథ్లెట్లకు బహుమతి డబ్బును పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఒలింపిక్ క్రీడల విజేతలకు 3 కోట్లు, 2 కోట్లు, 1 కోటి రూపాయలు ఇచ్చేవారు. Also Read:Pawankalyan : వెయ్యి కేజీల…