ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా యానిమల్ మూవీ ఫీవర్ నడుస్తుంది.బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీకి కాసుల వర్షం కురుస్తోంది. ఈ మూవీలో రణ్‍బీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా నటించారు. ఈ సినిమాలో రష్మిక నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. విలన్‍గా చేసిన బాబీ డియోల్ కూడా సూపర్ కమ్‍బ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రంలో రణ్‍బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ అద్భుతంగా నటించారు. అలాగే యానిమల్ మూవీ తో యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రి ఒక్కసారిగా పాపులర్ అయింది.సోషల్ మీడియాలో కూడా ఆమెకు బాగా క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 1న విడుదల అయిన యానిమల్ మూవీ 8 రోజుల్లో దాదాపు రూ.600కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. అయితే, ఇదే క్రమంలో యానిమల్ మూవీపై కొందరి నుంచి విమర్శలు కూడా తీవ్రంగా వస్తున్నాయి. కాగా, యానిమల్ సినిమాపై సంచలన దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన యానిమల్ మూవీ గురించి మాట్లాడారు.
యానిమల్ మూవీలో రణ్‍బీర్ కపూర్ నటన అద్భుతమని రామ్‍గోపాల్ వర్మ ప్రశంసించారు. అయితే, రణ్‍బీర్ క్యారెక్టర్‌ను వేరే హీరో ఎవరైనా చేసి ఉంటే ఎలా ఉండేదని ఊహించారా అని ఆర్జీవీకి ప్రశ్న ఎదురైంది.దీనికి రామ్‍గోపాల్ వర్మ స్పందించారు. యానిమల్ మూవీ లో రణ్‍బీర్ కాకపోతే రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాత్రమే ఆ పాత్రకు సూటయ్యే వాడని ఆర్జీవీ చెప్పారు.”సినిమా చూసిన తర్వాత ఆ విషయం చెప్పడం చాలా కష్టం. అయితే, నా అభిప్రాయం ప్రకారం రణ్‍బీర్ తప్ప మరెవరూ ఆ పాత్రను అలా చేయలేరు. అయితే, రణ్‍బీర్ కాకుండా అంటే విజయ్ దేవరకొండ అయితే చేసి ఉండేవాడు. వీరిద్దరూ తప్ప మిగిలిన వారు ఈ క్యారెక్టర్ చేయడం కష్టమే” అని రామ్‍గోపాల్ వర్మ తెలిపారు..యానిమల్ మూవీ తో సినిమా అంటే ఇలానే ఉండాలన్న ఫార్ములాను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బద్దలుకొట్టారని ఆర్జీవీ అన్నారు. అలాగే, ఆ మూవీలో హింస, బోల్డ్ సీన్లు హద్దులు దాటాయని వస్తున్న విమర్శలపైనా ఆర్జీవీ స్పందించారు.సినిమాలు ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపిస్తాయని తాను అస్సలు అనుకోవడం లేదని అన్నారు. సినిమాను సినిమాలాగే చూడాలని ఆర్జీవీ చెప్పారు. యానిమల్ కథ కంటే సందీప్ రెడ్డి వంగా దాన్ని తెరకెక్కించిన విధానమే తనకు అద్భుతంగా నచ్చేసిందని రామ్‍గోపాల్ వర్మ వివరించారు.