హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ సుమారు 3 గంటల పాటు జరిగింది. అయితే.. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌పై ఫైర్ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టారని ఎలా చెప్తారని అసహనం వ్యక్తం చేశారు. సీవీ ఆనంద్ ఐఎఎస్ ఆఫీసర్ ఆ..ఓక పార్టీ కార్యకర్తా అని ఆయన మండిపడ్డారు. సొంత పార్టీ నేతలపై ఎవరైనా వ్యతిరేక పోస్ట్‌లు పెడతారా అని ఆయన ధ్వజమెత్తారు. అబద్దాలు సీవీ ఆనంద్ ఎలా చెప్తారని, తీన్మార్ మల్లన్న ఎవరో తెలియదన్న రేవంత్ రెడ్డి.. తీన్మార్ మల్లన్న ఎవరినో తిడితే నాకు ఏం సంబంధమన్నారు. ఎవరైనా తిడితే వారిని చెప్పుతీసుకొని కొట్టండి.. కానీ నా పై అనవసర విమర్శలు చేయకండని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Fuel Tank Blast: సొరంగమార్గంలో పేలిన ఇంధన ట్యాంకర్.. 19 మంది దుర్మరణం
సోషల్ మీడియాలో ఎవరో పెడుతున్న పోస్ట్‌లు నాకు అంటకట్టకండని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకునే వ్యక్తిని.. అలాంటి వ్యక్తిని నేను పార్టీ నేతలపైన వ్యతిరేక పోస్ట్ లు ఎలా పెడతానని ఆయన ప్రశ్నించారు. కావాలనే నాపై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, పూలే కాదు అప్పుడప్పుడు రాళ్లు కూడా పడుతాయి.. అన్ని ఎదుర్కోవాలన్నారు. నాపై ఉన్న అపోహలు తీసేయండి..నమ్మకం తో పనిచేయండని, వార్ రూమ్ కి వెల్లి ..సునీల్ కనుగోలు టీం సభ్యులను ఎలా అరెస్ట్ చేసారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశౄరు. ఇది పార్టీ చాలా సీరియస్ గా తీసుకుందని ఆయన వెల్లడించారు.