సినీ అభిమానులకు ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఓటీటీలో రిలీజైన కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలో పైసా ఖర్చు లేకుండా హెచ్‌డీ క్వాలితో అభిమానులకు ఐబొమ్మ (బప్పం) అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ తగ్గడానికి కూడా పైరసీ సైట్ ఐబొమ్మనే కారణం. మొన్నటివరకు కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్ మాత్రమే పైరసీ చేసి తమ సైట్‌లో పెడుతూ…
Movie Piracy: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ పైరసీ రాయుళ్ల విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాల పైరసీపై లోతైన దర్యాప్తు చేసి దేశంలోనే తొలిసారిగా ఒక పైరసీ ముఠాను పట్టుకున్నామని తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. పైరసీ కారణంగా సినీ పరిశ్రమ భారీగా నష్టపోతోందని సీపీ వివరించారు. 2023లో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు రూ.22,400…
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు హైదరాబాద్‌లో ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారు. అక్టోబర్ 9, 10 తేదీలలో ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ‘ఎలైట్ క్రికెట్ లీగ్’ ద్వారా సేకరించిన నిధులను అమరవీరుల కుటుంబాలకు అందజేయనున్నారు.
అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం.. అన్నీ కేబినెట్ నిర్ణయం మేరకే! కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ముందు బహిరంగ విచారణకు హాజరయ్యారు. ఉదయం శామీర్‌పేట నివాసం నుంచి బీఆర్‌కే భవన్‌కు చేరుకున్న ఈటలను ఓపెన్ కోర్టులో కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 20 నిమిషాల పాటు బహిరంగ విచారణలో అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం చేశారు.…
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీ సంచలన విజయం సాధించి మొదటిసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ సాధించిన విజయాన్ని తమ విజయంగా భావించారు. బాణాసంచా కాలుస్తూ సంబరాల్లో మునిగితేలారు. మెట్రో సిటీలలో అభిమానం శృతి మించింది. రోడ్లపైకి వచ్చి క్రాకర్స్ కలుస్తూ…
హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. నిన్నటి వరకు కమిషనరేట్ కు ఒకే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండేది. నేటి నుంచి జోన్ ల వారికి అమలు లోకి రానున్నాయి. సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో జోనల్ సైబర్ సెల్స్ అమలులోకి వచ్చాయి. ఇక పై ప్రతి జోన్ లో ఒక్కో సైబర్ సెల్ స్టేషన్ ఉంటుంది. కాగా.. గడిచిన 9 సంవత్సరాల్లో సైబర్ నేరాలు 786…
Hyderabad Police : హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దుబాయ్‌లో జరుగుతున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025లో హైదరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసినందుకు గాను, ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కోటిక్స్ అవార్డులో హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ అవార్డును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) డీజీ సీవీ ఆనంద్ దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన…
No Firecrackers : భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు హైదరాబాద్ నగరంలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో, నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే నగరంలో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. Bangladesh: బంగ్లాదేశ్‌కు షాక్.. కేంద్రం కీలక నిర్ణయం..! సరిహద్దుల్లోని పరిస్థితులు ఆందోళనకరంగా…
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు అంతర్జాతీయ అవార్డు లభించింది.. సీవీ ఆనంద్కు ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డు ప్రదానం చేయనుంది.. డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించినందుకు సీవీ ఆనంద్కు అవార్డు దక్కింది.. దుబాయ్లో జరగబోయే అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో అవార్డు ప్రదానం చేస్తారు.. ఈ ముఖ్యమైన వేదిక అయిన వరల్డ్ పోలీస్ సమ్మిట్-2025 కు 138 దేశాల నుంచి ప్రముఖ పోలీసు అధికారులు ఒకేచోట సమావేశమవుతున్నారు.