CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి रवానవుతారు. అక్కడ ఆయన ఏఐసీసీ (AICC) నేతలను కలిసి, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, మంత్రుల శాఖల కేటాయింపు, పార్టీ కార్యవర్గ విస్తరణపై కీలక చర్చలు జరపనున్నారు. ఇటీవల కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Water Storage at Dams: వరద ప్రవాహం.. నీటితో కళకళాడుతున్న శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు..!
ఈ విషయమై ఆదివారం రాత్రి నుంచే సోషల్ మీడియాలో అంచనాలు ప్రారంభమైనప్పటికీ, అధికారికంగా సోమవారం లేదా మంగళవారం శాఖల కేటాయింపు ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న అనేక శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. వీటిలో విద్య, పురపాలక, హోం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్థక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖలు ప్రముఖంగా ఉన్నాయి. ఇవి కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం.
కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం, గడ్డం వివేక్‌కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, యువజన, న్యాయ లేదా మత్స్య శాఖలు కేటాయించే అవకాశముందని చర్చ జరుగుతోంది. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు యోచిస్తోంది. దీనికి సంబంధించి సభల తేదీలను ఖరారు చేసే అంశాన్ని కూడా సీఎం రేవంత్ ఢిల్లీలో చర్చించనున్నట్లు సమాచారం.