Water Storage at Dams: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 893 క్యూసెక్కులుగా నమోదు కాగా, అవుట్‌ఫ్లో పూర్తిగా నిలిచింది. జలాశయానికి సంబంధించిన పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 835.20 అడుగుల నీటిమట్టం ఉంది. అలాగే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 55.3581 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇటీవల వర్షాలు తగ్గిన నేపథ్యంలో జలాశయంలోకి వరద ప్రవాహం తక్కువగా ఉంది. మరోవైపు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా తాత్కాలికంగా నిలిపివేయబడినట్టు సమాచారం.
Read Also: Marriage Scam: భర్త, పిల్లలు ఉన్న సరే.. మరో యువకుడిని పెళ్లాడిన మాయలేడీ.. చివరకి..?
అలాగే తుంగభద్ర జలాశయంలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 7,653 క్యూసెక్కులుగా నమోదు కాగా.. అవుట్‌ఫ్లో 213 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1601.69 అడుగులు మాత్రమే నీరు ఉన్నది. అలాగే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 23.786 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. భవిష్యత్తులో వరద ఉద్ధృతి పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరు జలాశయాల్లోని నీటి మట్టాలపై అధికారులు నిత్యం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Also: Gadikota Srikanth Reddy: రాయచోటి ఓటింగ్ పై మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!