యంగ్ హీరోయిన్ అవికా గోర్ గురించి పరిచయం అక్కర్లేదు. చిన్నారి పెళ్లికూతురు (బాలికా వధు) సిరియల్లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్ గా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన అవికా గోర్.. అనంతరం వరుస సినిమాలు తీసినప్పటికి, హీరోయిన్‌గా బారీ స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. అయనప్పటకి ఈ అమ్మడు ఫలితం ఆశించకుండా లైన్ గా సినిమాలు సిరీస్‌లు తీస్తునే ఉంది. అయితే ఇటివల ఓ అవార్డ్ ఫంగ్షన్‌లో మాట్లాడిన అవికా కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేసింది..
Also Read : Ee Nagaraniki Emaindi 2 : ‘ఈ నగరానికి ఏమైంది 2’ పై తరుణ్ పోస్ట్ వైరల్..
‘ ‘బాలికా వధు’తో మొదలైన నా కెరీర్ ఈ స్థాయికి ఎదగడం నిజంగా నా అదృష్టం. ప్రేక్షకులు ఈ రోజు నాకు ఈ స్థాయినిచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అధికారిక శిక్షణ లేదా చిత్ర పరిశ్రమ నేపథ్యం లేకుండానే ఈ స్టెజ్‌లో ఉన్నాను. కనీసం నాకు ఇంటి నుంచి కూడా సరైన మద్ధతు లేదు. అయినా నటిగా ఒక స్థాయికి ఎదిగినందుకు ఆనందంగా ఉంది. మంచి పాత్రలు వచ్చినప్పుడు బాధ్యతగా నటించి విజయం అందుకునేలా చేయడం ఆర్టిస్టు బాధ్యత. OTT లేదా టెలివిజన్ లేదా సినిమా ఏదైనా సరే నేను ఒకే విధంగా పని చేస్తాను. నేను దానిని తేలికగా తీసుకోలేను. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని ఒడిదుడుకులను అధిగమించి అనుకున్న స్థాయికి చేరతా’ అని తెలిపింది అవికా.