CM Revanth Reddy: కేసీఆర్, హరీశ్ రావు కలిసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly: ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టున్న ఇబ్బందులు తొలగించడానికి గతంలో రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ కమిటీ నియమించారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కమిటీ గత సీఎం కేసీఆర్ కు నివేదిక ఇచ్చింది.. కేసీఆర్ వేసిన కమిటీనే ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు సాధ్యమని రిపోర్ట్ ఇచ్చింది.. గతంలో వాస్తవాలతో కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ తొక్కిపెట్టారు అని ఆయన పేర్కొన్నారు. అయితే, మేడిగడ్డ బ్యారేజీ కట్టాలనేది కేసీఆర్ ఆలోచన చేశారు.. దాంతో కమిటీ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకోకుండా మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టారు.. ప్రాజెక్టులపై వాస్తవాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ ముందు పెట్టే ప్రయత్నం చేశారు.. కానీ, వాస్తవాలను కూడా తప్పుల తడక అని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Peddireddy Ramachandra Reddy: 151 కంటే ఎక్కవ స్థానాలు గెలుస్తాం.. రాప్తాడు సభ తర్వాత మరింత ఊపు..!
Also Read
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ఇక, తెలంగాణ ఇచ్చింది మేమే.. తెలంగాణ తెచ్చినోళ్లు మావాళ్లే అని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే బారిన పడ్డది మా కాంగ్రెస్ ఎంపీలే అన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. తప్పు ఒప్పుకోండి కప్పిపుచ్చుకోకండి అన్నారు. కేసీఆర్, హరీశ్ రావు కలిసి తెలంగాణ తీరని ద్రోహం చేశారు అని ఆయన ఆరోపించారు. ఇక, తెలంగాణకు నీళ్లిచ్చిన అపరభగీరథుడు కేసీఆర్ అని చెప్పుకుంటున్నారు.. నెమలికే కేసీఆర్ నాట్యం నేర్పినట్లు మాట్లాడుతున్నారు.. దోచుకోవాలి, దాచుకోవాలన్న ఆలోచనతో దర్మార్గానికి ఒడిగట్టారు.. ఎవరు మాట్లాడితే వారిపై దాడి చేస్తున్నారు అని సీఎం రేవంత్ అన్నారు.
Read Also: Ola : త్వరపడండి.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై రూ. 25000 తగ్గింపు
అయితే, కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ కళంకంగా మారింది.. ప్రజలను నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే తెలంగాణను నిండా ముంచారు.. కూలిన ప్రాజెక్టును చూసి మీరు సిగ్గుపడాలి అంటూ ఆయన వ్యాఖ్యనించారు. హరీశ్ రావు సాగునీటి మంత్రిగా కొనసాగించి.. ఆ తరువాత ఎందుకు బర్తరఫ్ చేశారు అని ప్రశ్నించారు. ఈ పాపాలన్నింటికి కేసీఆర్, హరీశ్ రావే కారణం.. తెలంగాణ రాష్ట్రానికి చెదలు పట్టించారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: Vijayawada: చలో విజయవాడకు సీపీఎస్ ఉద్యోగుల పిలుపు.. అమల్లో 144 సెక్షన్
చేవేళ్ల చెల్లమ్మ కోసమే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంతో చేవేళ్లకు కేసీఆర్ అన్యాయం చేసిండు అని సబితమ్మ ధర్నా చేశారు.. ఇప్పుడు మాత్రం సబితమ్మ మాట్లాడటం లేదు అని పేర్కొన్నారు. ఇవాళ మౌనంగా హరీశ్ రావుని సమర్దిస్తున్నారు.. అక్క బాధ్యత ఏంటి.. తమ్ముళ్లు తప్పు చేస్తే సరిదిద్దాలి అని ఆయన చెప్పుకొచ్చారు. చేవెళ్ల ఎండిపోయినా ఏం కనపడదు అక్క మాత్రం సారిదిద్దరూ.. వాళ్ళ బడి అది.. అక్కడ చేరగానే సిలబస్ మారుతుంది.. కడియం శ్రీహరి మంచోడు.. కానీ అక్కడకు పోయి అలా తయ్యార్ అయ్యారు.. విచారణకి వెళ్లి తప్పు ఒప్పుకుని రండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!