Monsoon : భరించలేని ఎండలతో ఇబ్బంది పడుతున్న జనాలకు శుభవార్త. చల్లటి వర్షం కోసం నిరీక్షణ ముగిసింది. గురువారం రుతుపవనాలు కేరళ తీరంతో సహా ఈశాన్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను తాకాయి.
మిజోరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ కూలిపోవడంతో 10 మంది కార్మికులు చనిపోయారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్లో రెమల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఈ తుఫాన్ ధాటికి ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. రెమల్ తుఫాను నేపథ్యంలో గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు వెళ్లే 14 విమానాలను రద్దు చేసింది. తుఫాను కారణంగా పలు విమానయాన సంస్థలకు చెందిన విమానాలు రద్దు చేసినట్లు గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారి తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో రెమల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో బెంగాల్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా.. తుఫాన్ ఎఫెక్ట్తో బెంగాల్ తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, ఆస్తికి విస్తృతమైన నష్టాన్ని చవిచూశాయి. రెమల్ తుఫాను బెంగాల్ రాష్ట్రం పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో గంటకు 135 కిమీ వేగంతో గాలులు వీచినట్లు అధికారులు సోమవారం తెలిపారు. సెంట్రల్ కోల్‌కతాలోని ఎంటల్లీలోని బిబీర్ బగాన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఎడతెరిపి లేకుండా…
Remal Cyclone : 'రెమాల్' తుఫాను బలహీనపడింది. గత రాత్రి ఈ తుఫాను పశ్చిమ బెంగాల్ తీరాలను తాకింది. అయితే అది తన దూకుడు రూపాన్ని చూపకముందే అక్కడికి చేరుకుంది.
Remal Cyclone : బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తుపాను 'రెమల్' తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తర బంగాళాఖాతంలో సముద్రంలో దీని గరిష్ట వేగం గంటకు 135 కి.మీ.
'రెమాల్' తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. మరోవైపు తీవ్ర తుపాను 'రెమల్' హెచ్చరికల మధ్య కోల్కతాలో వర్షం ప్రారంభమైంది. ఈ మేరకు వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది. ముందస్తు రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో తుఫాను రావడం ఇదే తొలిసారి. భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 'రెమల్' ఉత్తర బంగాళాఖాతం, ఖేపుపారాకు 220…
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుఫాన్‌గా మారింది. దానికి రేమాల్‌గా నామకరణం చేశారు. రేమాల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంది.