Delhi Car Blast: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ మొహమ్మద్ గురించి ఓ ప్రధాన అంశం వెల్లడైంది. ఉమర్ పేలుడుకు ముందు ఓల్డ్ ఢిల్లీలోని ఒక మసీదుకు వెళ్ళాడు. ఎర్రకోట వైపు వెళ్ళే ముందు 10 నిమిషాలకు పైగా అక్కడే గడిపాడు. ఇది ఫైజ్-ఎ-ఇలాహి మసీదు. తుర్క్‌మాన్ గేట్ ఎదురుగా రాంలీలా మైదాన్ మూలలో ఉంది. నిజాముద్దీన్ మర్కజ్ లాగానే ఈ మసీదులో తబ్లిగీ జమాత్ జరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం దర్యాప్తు బృందం ఆ మజీద్‌ను పర్యవేక్షిస్తోంది. CCTV ఫుటేజ్‌లో ఉమర్ మసీదులోకి ప్రవేశించి బయటకు వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
READ MORE: Kajol : 26 ఏళ్ల తర్వాత మ్యరెజ్ లైఫ్ కి ఎక్స్పైరీ డేట్ ఉండాలి అంటున్న.. కాజోల్
మరోవైపు.. ఢిల్లీ బాంబు దాడి కేసు దర్యాప్తులో సంచలన విషయం బయటపడింది. పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 కారులో ఉన్న వ్యక్తి మరెవరో కాదు ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ (ఉమర్ మొహమ్మద్) అని పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు బుధవారం రాత్రి ఆలస్యంగా నిర్ధారించాయి. కారు శిథిలాల నుంచి వెలికితీసిన కాలిపోయిన మృతదేహానికి DNA పరీక్ష నిర్వహించగా.. ఉమర్ కుటుంబ సభ్యుల నమూనాలతో 100% సరిపోలింది. 12 మందిని బలి తీసుకున్న, 20 మందిని ఆసుపత్రి పాలు చేసిన ఢిల్లీ కార్ బాంబు దాడిని ఉగ్రవాది ఉమర్ నిర్వహించాడని నిర్ధారణ అయ్యింది. దాడికి ఉపయోగించిన తెల్లటి హ్యుందాయ్ ఐ20 కారును పేలుడుకు 11 రోజుల ముందు కొనుగోలు చేసిన డాక్టర్ ఉమర్ దాడికి పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి అనుమానించాయి. అతను ఫరీదాబాద్‌లోని వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్లో కీలక సభ్యుడిగా ఉన్నాడు. పుల్వామాలోని సంబురాలో నివసించే ఉమర్ కుటుంబ సభ్యులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ప్రశ్నించింది. ఒమర్ తల్లి, సోదరుడు DNA నమూనాలను అందించారు. ఇవి పేలుడులో ఉపయోగించిన కారు శిథిలాలలో లభించిన అవశేషాలతో (ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలు) సరిపోలాయి.
READ MORE: IND vs SA: ఇద్దరు కీపర్లు, ముగ్గురు స్పిన్నర్లు.. పాపం నితీష్ రెడ్డి, టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!