Delhi Car Blast: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ మొహమ్మద్ గురించి ఓ ప్రధాన అంశం వెల్లడైంది. ఉమర్ పేలుడుకు ముందు ఓల్డ్ ఢిల్లీలోని ఒక మసీదుకు వెళ్ళాడు. ఎర్రకోట వైపు వెళ్ళే ముందు 10 నిమిషాలకు పైగా అక్కడే గడిపాడు. ఇది ఫైజ్-ఎ-ఇలాహి మసీదు. తుర్క్మాన్ గేట్ ఎదురుగా రాంలీలా మైదాన్ మూలలో ఉంది. నిజాముద్దీన్ మర్కజ్ లాగానే ఈ మసీదులో తబ్లిగీ జమాత్ జరుగుతుందని చెబుతున్నారు.…
Delhi Blast Case: ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో దర్యాప్తు సంస్థలు పెద్ద పురోగతి సాధించాయి. హర్యానాలోని ఖండావాలి గ్రామం సమీపంలో ఫరీదాబాద్ పోలీసులు ఎర్ర రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు (DL10CK0458)ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులు హెచ్చరిక జారీ చేసిన కారు ఇదేనని పోలీసు ప్రతినిధి తెలిపారు. ఆ వాహనాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పోలీసులకు, ఇతర కేంద్ర సంస్థలకు సమాచారం అందించారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు…
దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో ఇప్పటివరకు 9 మంది మరణించగా.. 20 మంది గాయపడ్డారు. పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దర్యాప్తు సంస్థల ప్రకారం.. కారులో పేలుడు పదార్థాలు అమర్చి బ్లాస్ట్ చేశారు. ఇది ఆత్మాహుతి దాడి అని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఢిల్లీ ఎర్రకోట పేలుడుకు ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధం ఉందని తేలింది. పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు…
Delhi Car Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో ఒక కారులో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ పేలుడు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద సంభవించింది. కారు పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ భారీ పేలుడు కారణంగా కారులో మంటలు చెలరేగాయి, అలాగే మరో మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి సమీపంలో పార్క్ చేసిన వాహనాల…
Delhi Acid Attack 2025: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఒక విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. గాయపడిన విద్యార్థిని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కళాశాలకు వెళుతుండగా కాలేజీకి కొద్ది దూరంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో ఆమె చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు. READ ALSO: Post Office SCSS: పోస్టాఫీసులో సూపర్ స్కీమ్..…
Wife Kills Husband: భర్త తనను లైంగికంగా సంతృప్తి పరచలేదనే కారణంతో భార్య దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మొహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్ (32), ఫర్జానా ఖాన్ (29) భార్యాభర్తలు. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని జూలై 20వ తేదీ సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో నిహాల్ విహార్ ప్రాంతంలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి ఇర్ఫాన్‌ను ఫర్జానా ఖాన్ తీసుకొచ్చింది. ఇర్ఫాన్…