బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‍తో బాలీవుడ్‍లో ‘రామాయణం’ ను తెరకెక్కిస్తున్నారు.ఈ రామాయణంలో శ్రీరాముడిగా రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి మరియు రావణుడిగా యశ్ నటించనున్నారు. మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించనున్నారు. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఓ ప్రత్యేకమైన రోజును మూవీ టీమ్ నిర్ణయించిందని తాజాగా సమాచారం వెల్లడైంది.రామాయణం సినిమాను శ్రీరామనవమి పండుగ రోజైన ఏప్రిల్ 17వ తేదీన అధికారికంగా ప్రకటించాలని మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాను ఏప్రిల్ 17న అనౌన్స్ చేయనున్నట్టు ఈ మూవీని నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌస్ వర్గాల నుంచి సమాచారం తెలిసిందని పింక్ విల్లా రిపోర్ట్ వెల్లడించింది.రామాయణం సినిమా నటీనటులు, టెక్నిషియన్లు మరియు రిలీజ్ ప్రణాళిక విషయాలను ప్రకటించేందుకు రామనవమి కంటే అత్యుత్తమమైన రోజు ఉండదని ఆయన చెప్పినట్టు వెల్లడించింది. 2025 దీపావళికి రామాయణం పార్ట్-1ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.
రామాయణం సినిమాలో కీలకపాత్రలు చేయనున్న బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి, కన్నడ స్టార్ యశ్‍కు ఇప్పటికే లుక్ టెస్టులు,ప్రీ-విజువలైజేషన్ మరియు టెక్ రిహార్సల్స్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కూడా భారీగా ఉండనుంది.రామాయణం మూవీ షూటింగ్ మార్చిలోనే మొదలుకానుందని సమాచారం.. టెక్నికల్‍గా అత్యంత అడ్వాన్డ్స్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని దర్శకుడు నితేశ్ తీవారీ భావిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆస్కార్ అవార్డులను గెలిచిన వీఎఫ్‍ఎక్స్ కంపెనీ డీఎన్‍ఈడీని ఆయన నియమించుకున్నారు. హాలీవుడ్ టెక్నిషియన్లు.. ఈ చిత్రం కోసం ఇండియాకు వచ్చే పని చేయనున్నారని సమాచారం. నొయిడాలోని ఫిల్మ్ సిటీలో మూవీ ఎక్కువ భాగం షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.ఈ రామాయణంలో హనుమంతుడిగా సన్నీ డియోల్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్ నటించడం దాదాపు ఖరారైనట్లు సమాచారం.. కైకేయి పాత్రలో లారా దత్త అలాగే శూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారని సమాచారం.. దశరథుడి పాత్ర కోసం దిగ్గజ యాక్టర్ అమితాబ్ బచ్చన్‍తో మూవీ టీమ్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మూవీ అనౌన్స్‌మెంట్ రోజున ఈ విషయాలను చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించనుంది.