Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంతో పాటు పోటీకి దిగిన వాల్తేరు వీరయ్య మంచి కలక్షన్స్ అందుకోవడంమే కాకుండా ఈ మధ్యనే రూ. 200 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. దీంతో చిత్ర బృందం విజయోత్సవాల్లో మునిగి తెలుతోంది. ఈ నేపథ్యంలోనే వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ కు మేకర్స్ ప్లాన్ చేసారు. వీరయ్య విజయ విహారం పేరుతో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ యూనివర్సిటీలో గ్రాండ్ గా సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించడానికి వేదికను సిద్ధం చేశారు.
ఇక ఈనెల 28వ తేదీన జరుగుతున్న ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రామ్ చరణ్ రానున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ అంతర్జాతీయ గుర్తింపును అందుకున్నాడు. ఇప్పుడు చరణ్ ఈ వేడుకకు వస్తే.. ఇంకా ఈ ఈవెంట్ హైలైట్ గా మారుతోంది. మెగా ఫ్యాన్స్ అయితే ఈ వేడుక కోసం ఎన్నోరోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఒకే వేదికపై కనిపించనున్నారు అంటే.. అసలైన పూనకాలు ఇక మొదలైనట్లే అని కామెంట్స్ పెడుతున్నారు. మరోపక్క.. ఆల్రెడీ సినిమా హిట్ టాక్ తెచ్చుకుందిగా ఇంకా కొడుకు సాయం ఎందుకు చిరు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా రవితేజ, చిరంజీవి, రామ్ చరణ్ ఫోటో కోసం అభిమానులు చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.