Game Changer : 2019లో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. సినిమాలో కథ బాగుంది కానీ దాన్ని ప్రజెంటేషన్ చేసిన విధానం బాగాలేదని సమీక్షలు చెబుతున్నాయి. ఆ సినిమా చేయడం రామ్ చరణ్ కెరీర్‌లో అతిపెద్ద తప్పు అని అభిప్రాయపడిన అభిమానులు ఉన్నారు. ఆ సినిమాను మర్చిపోయేలా చేయడానికి కాస్త ఆలస్యమైనప్పటికీ చరణ్ ‘RRR’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా అతిపెద్ద బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది.
Read Also:Bangladesh: ప్రజల అదృశ్యం వెనుక భారత్ హస్తం ఉంది.. అక్కసు వెళ్లగక్కిన ముస్లిం దేశం
Vibe at Dallas🤩🥳#GameChangerGlobalEvent #RamCharan #GameChanger #Dhop pic.twitter.com/Ut5Jahi2Sf
— John Wick 🚁 (@JohnWick_fb) December 22, 2024
సోలో హీరోగా నాలుగు సంవత్సరాల తర్వాత, అతని నుండి గేమ్ ఛేంజర్ సినిమా వస్తోంది. వినయ విధేయ రామ తర్వాత, చరణ్ రాబోయే సోలో హీరో సినిమా గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ ఇటీవల సినిమా ప్రమోషన్ల కోసం అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు, ఇతర యూనిట్ సభ్యులతో కలిసి పాల్గొననున్నారు రామ్ చరణ్. అక్కడ స్టేడియం భారీగా తరలి వచ్చిన అభిమానులతో కిక్కిరిసిపోయింది. రామ్ చరణ్ మేనియా డల్లాస్ లో కనిపిస్తోంది.
Excellent Response From Dallas Prajanikam👏 Kottadayya Sixeru💫 Event Success Okkate Pending🕺
Vachina Andaru Happy Ga Intiki Vellali 🤌 #GameChanger #GameChangerGlobalEvent pic.twitter.com/PMu9OiGctW— Johnnie Walker🚁 (@Johnnie5ir) December 22, 2024
Read Also:Anasuya : నాకు మరో బిడ్డ కావాలి.. కానీ మా ఆయన కోపరేట్ చేయడం లేదు : అనసూయ
గేమ్ ఛేంజర్ సినిమా తన అభిమానులను ఏ విధంగానూ నిరాశపరచదని రామ్ చరణ్ అభిమానులకు హామీ ఇచ్చారు. ఇది సినిమాపై అంచనాలను పెంచింది. గత ఏడాది కాలంగా ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పొలిటికల్ డ్రామాలో చరణ్ తండ్రీ కొడుకుల పాత్రల్లో కనిపించబోతున్నాడు. చరణ్‌ను మొదటిసారి తండ్రి కొడుకుల పాత్రల్లో చూడబోతున్నందున అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.