Anasuya : టాలీవుడ్ బ్యూటీఫుల్ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు బుల్లితెరపై బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమా షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నారు. తను తాజాగా పుష్ప2: ది రూల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్‌ను అందుకున్నారు. ఓ పక్క వరుసగా సినిమాల్లో నటిస్తూనే.. ఫ్యామిలీకి క్వాలిటీ టైమ్ కేటాయిస్తున్నారు అను. ఎప్పటికప్పుడు ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి చిల్ అవుతుంటారు. రీసెంట్ గా అమ్మడు మూడో ప్రెగ్నెన్సీపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Read Also:Brazil Accident: బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి
ఇప్పటికే ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన అనసూయ.. తనకు మూడో బిడ్డను కనాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. అది కూడా తనకు ఆడపిల్లకు జన్మనివ్వాలని ఉందని చెప్పుకొచ్చారు. ఆ విషయంలో భర్త కోపరేట్ చేయడం లేదని చెబుతూ నవ్వేశారు. ఎందుకు ఆడబిడ్డను కనాలని అనుకుంటున్నారో కూడా చెప్పారు అనసూయ. ప్రస్తుతం తన వయసు నలభై ఏళ్లు. ఈ సమయంలో మళ్లీ తల్లి కావాలనుకోవడమే ఆశ్చర్యంగా మారింది. అయితే అందుకు ఓ బలమైన కారణం ఉంది. ఇంట్లో అమ్మాయి ఉంటే ఆ ఫీలింగ్ వేరే అని, ఆమె చేసే అల్లరి వేరేలా ఉంటుందని, లైఫ్ బ్యాలెన్స్ అవుతుందన్నారు.
Read Also:Game Changer : న భూతో న భవిష్యత్ అనేలా అమెరికాలో గేమ్ ఛేంజర్ ఈవెంట్
అమ్మాయి లేని జీవితమే వేస్ట్ అని చెప్పింది అనసూయ. ఇప్పుడు ఇద్దరు మగపిల్లలు, వాళ్ల భర్త సుశాంక్‌తో కలిసి ముగ్గురు అబ్బాయిలుంటారు. ముగ్గురు మీసాలు గడ్డాలతో ఉంటారు. కూతురు ఉంటే కంట్రోల్‌లో ఉంటారు. ఇళ్లు బ్యాలెన్స్ అవుతుందని, ఇళ్లు చక్కబెట్టాలంటే ఆడపిల్ల కావాల్సిందేనని చెప్పింది. ఇంత వరకు బాగానే ఉంది, కానీ అమ్మాయిని కనేందుకు తన భర్త సహకరించడం లేదని చెప్పి నవ్వించింది అనసూయ. మళ్లీ పిల్లల్ని కనాలంటే కో ఆపరేట్ చేయడం లేదని, నీకేంటే కనేసి వెళ్లిపోతావ్, హాయిగా జాబ్ చేసుకుంటావు. నేనే భరించాలి అంటుంటాడని చెప్పింది. పాపం అనసూయకి ఆడపిల్లని కనాలని ఉంది, కానీ వాళ్ల భర్త సపోర్ట్ చేయడం లేదంటూ ఓపెన్‌గా ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. అనసూయ ఇంత బోల్డ్ గా రియాక్ట్ కావడంతో ఆమె వీడియో క్లిప్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. సినీ ఇండస్ట్రీలోకి నాగ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. సోగ్గాడే చిన్ని నాయనా మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. అలా ఆ తర్వాత మంచి అవకాశాలు రాగా.. బుల్లితెరకు బై చెప్పేసి సినిమాలతో బిజీ అయిపోయింది.