తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా దూసుకెళ్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇప్పుడు మరొక కారణంతో కూడా వార్తల్లో నిలుస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో సాలిడ్ కలెక్షన్లు అందుకుంటోంది. సక్సెస్ సెలబ్రేషన్స్ మొత్తానికి మూడింతలు పెరిగిపోయేలా ఒక స్పెషల్ గెస్ట్ ఈవెంట్‌లో హాజరయ్యాడు. అదీ యంగ్ అండ్ మాస్ డైరెక్టర్ కొల్లి బాబీ.
Also Read : Tamannaah Bhatia : బోని కపూర్ అనుమతిస్తే.. తమన్నా కల నెరవేరినట్లే
సక్సెస్ మీట్‌కు హాజరైన కొల్లి బాబీ, అక్కడే ఒక మెగా ఛాన్స్ ప్రకటించడం ఈవెంట్ హైలైట్‌గా మారింది. తాను చేయబోయే మెగాస్టార్ చిరంజీవి 158 వ సినిమా కోసం ‘రాజు వెడ్స్ రాంబాయి’ టీమ్‌కు పెద్ద ఆఫర్ ఇచ్చారు. సినిమాలో సాహిత్యాన్ని రాసిన రచయితకు, అలాగే డైరెక్టర్ బోస్‌కు కూడా తన ప్రాజెక్ట్‌లో అవకాశం ఇస్తానని ప్రకటించేశారు. అంతేకాదు, దర్శకుడు బోస్ చెప్పినట్లు, తాను మెగాస్టార్‌తో ఒక చిన్న సీన్‌లో అయినా నటించాలనే కోరికను బాబీ వెంటనే అంగీకరించడంతో ఆ క్షణం ఫ్యాన్స్‌లో వైరల్ అయ్యిపోయింది. ఈ విధంగా, కేవలం మంచి సినిమా తీసినందుకు మాత్రమే కాకుండా, మెగా క్యాంప్ గమనానికి కూడా ‘రాజు వెడ్స్ రాంబాయి’ టీమ్ వచ్చేశారని చెప్పవచ్చు. సాహిత్య రచయిత నుండి దర్శకుడు వరకు, ఈ చిత్ర యూనిట్ కీలక సభ్యులు ఇప్పుడు మెగాస్టార్ 158వ సినిమా టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఒక చిన్న సినిమాకు వచ్చిన ఈ మెగా ఆఫర్ ఇప్పుడు వారి కెరీర్ గ్రాఫ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందనడంలో సందేహమే లేదు.