రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్లు పొందడానికి దరఖాస్తు చేసి, ఎమ్మర్వో ఆమోదం కోసం వేచి చూడాల్సి వచ్చేది.
Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. అభ్యర్థులు ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియపై సమీక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు మార్గదర్శకాలను వెల్లడించారు.…
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన తనను అడ్డుకున్నారని నమిత వీడియోను రిలీజ్ చేశారు, నన్ను, నా కుటుంబ సభ్యులను హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారని సిబ్బంది దురుసుగా, అహంకారంగా మాట్లాడారని నమిత వీడియోలో తెలిపింది.
Fake Certificates : రంగారెడ్డి జిల్లాలోని మంచాల ఎమ్మార్వో ఫిర్యాదుతో కొన్ని ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన విశేషాలు బయటకు వచ్చాయి. తెలియని వ్యక్తులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకుండానే కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన పత్రాలను ఎమ్మార్వో అనుమతి లేకుండానే జారీ చేస్తున్నట్లు మంచాన ఎమ్మార్వో ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది మోసం. ఈ నేపథ్యంలో మంచాన ఎమ్మార్వో కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు పనిచేస్తున్న సురేష్, అలాగే మీసేవ సెంటర్ రవి పై పోలీసులకు…
మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా క్యాస్ట్ సర్టిఫికెట్ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆమె 2019లో ఎస్సీ కేటగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే, ఆమె ఎస్సీ సర్టిఫికెట్‌ను చట్టవిరుద్ధంగా పొందారనే కారణంతో దాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ లోక్‌సభ ఎంపీ నవనీత్ కౌర్…
ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. ఒకసారి కుల ధ్రువీకరణ పత్రం జారీ చేస్తే దానిని శాశ్వతంగా పరిగణించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది.
ఏపీలోని గ్రామ సచివాలయాల్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్ లీలలు బయటపడుతున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే ఏ సామాజిక వర్గం వారికైనా ఎస్టీ సర్టిఫికెట్ జారీ అవుతోంది. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన షేక్ షబ్బీర్ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి ఆయన దరఖాస్తుకు ఆమోదం తెలిపారు. అయితే సదరు వ్యక్తి షేక్…