Rajasthan Royals Batting Innings Completed Against SRH: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఈ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు విధ్వంసకరమైన శుభారంభాన్ని ఇవ్వడం వల్లే.. రాజస్థాన్ ఈ స్థాయిలో పరుగులు చేయగలిగింది. యశస్వీ జైస్వాల్, జాస్ బట్లర్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. వీళ్లిద్దరు క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి.. వీరబాదుడు మొదలుపెట్టారు. దొరికిన ప్రతీ బంతిని బౌండరీగా మార్చేశారు. కేవలం 5.4 ఓవర్లలోనే వీళ్లిద్దరు కలిసి తొలి వికెట్‌కి ఏకంగా 85 పరుగులు చేశారు. ఈ క్రమంలో జాస్ బట్లర్ 20 బంతుల్లోనే తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే.. 54 వ్యక్తిగత స్కోరు వద్ద అతడు పెవిలియన్ చేరాడు.
Samantha: చైతన్యతో విడాకులు.. ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నా
బట్లర్ తర్వాత వచ్చిన సంజూ శాంసన్.. యశస్వీతో కలిసి స్కోర్ బోర్డుని ముందుకు నడిపించాడు. కానీ.. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత యశస్వీ (54) సైతం ఔటయ్యాడు. ఆ తర్వాత వెనువెంటనే మరో రెండు వికెట్లు పడినా.. కెప్టెన్ సంజూ మాత్రం ఒత్తిడికి గురవ్వకుండా ఎడాపెడా షాట్లు వాయించాడు. దీంతో.. అతడు కూడా అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే.. 55 వ్యక్తిగత పరుగుల వద్ద భారీ షాట్ కొట్టబోయి, క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లో వచ్చిన హెట్‌మేయర్ (22) కొంచెం మెరుపులు మెరిపించాడు. ఫలితంగా.. రాజస్థాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేయగలిగింది. నిజానికి.. రాజస్థాన్ విధ్వంసకర ఆరంభాన్ని చూసి, ఈ జట్టు 250 పరుగులు కొట్టినా కొట్టొచ్చని మొదట్లో అంచనా వేశారు. కానీ.. క్రమంగా వికెట్లు పడటంతో, రాజస్థాన్ జోరు తగ్గింది.
Kodandaram: టీఎస్‌పీఎస్‌సీ కమిటీ తొలగించి.. కొత్త కమిటీ వేయాలి
ఇక సన్‌రైజర్స్ బౌలర్స్ విషయానికొస్తే.. ఫారుఖీ, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిన్ ఒక వికెట్ తీశాడు. బౌలర్లలో ఫారుఖీనే మ్యాచ్ తిప్పేశాడని చెప్పుకోవచ్చు. ఓపెనర్లను ఎవ్వరు ఔట్ చేయలేకపోతున్న సమయంలో.. ఫారుఖీ వారి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. 85 పరుగుల వద్ద బట్లర్ వికెట్ తీశాడు. అతను తీసిన ఈ వికెట్ వల్లే.. రాజస్థాన్ స్కోరు కాస్త నెమ్మదించింది. ఆ తర్వాత యశస్వీని కూడా ఔట్ చేశాడు. ఈ రెండు కీలక వికెట్లు తీయడం వల్లే.. రాజస్థాన్ రన్ రేట్ తగ్గుముఖం పట్టింది.