Rahul Gandhi: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశాన్ని మొత్తం చుట్టేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు.. శనివారం (రేపు) రోజు కడప జిల్లాకు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ.. ఉదయం 11.30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్.. అక్కడ నుంచి హెలిప్యాడ్ లో ఉదయం 11.45 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు.. మధ్యాహ్నం 12 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించనున్న రాహుల్ గాంధీ.. మధ్యాహ్నం 12.20 నిముషాలకు ఇడుపులపాయ నుంచి కడపలోని సభా స్ధలికి వెళ్లనున్నారు.. ఇక, మధ్యాహ్నం ఒంటి గంటకు సభాస్ధలికి చేరుకుని.. ఆ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.. మధ్యాహ్నం 1.45 గంటల వరకు సభా స్ధలిలో ఉండనున్న రాహుల్ గాంధీ.. సభ అనంతరం కడప విమానాశ్రయానికి చేరుకుంటారు.
Read Also: CSK vs GT: సెంచరీలతో చెలరేగిన గిల్, సుదర్శన్.. గుజరాత్ భారీ స్కోరు
కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని చోట్ల రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుఇంది.. ఈ నెల 13వ తేదీ ఎన్నికల్లో కీలకమైన ఘట్టం పోలింగ్ జరగనుండగా.. వచ్చే నెలలో ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.. అయితే, దేశవ్యాప్తంగా విస్తృత్తంగా పర్యటిస్తూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ.. ఇప్పటికే పలు మార్లు.. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రచారంలో పాల్గొన్న విషయం విదితమే.