iQOO Z7 Pro 5G Smartphone Launch in India: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘ఐకూ’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. గత నెలలో ఐకూ నియో 7 ప్రోను లాంచ్ చేసిన ఐకూ.. ఆగష్టులో ఐకూ జెడ్ 7 ప్రో (iQOO Z7 Pro 5G)ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఆగస్టు 31న భారత్ మార్కెట్లోకి వస్తుందని ఐకూ ఇండియా సీఈఓ నిపున్ మరియా ఇప్పటికే తెలిపారు. లాంచ్‌కు ఇంకా కొంత సమయం ఉన్నా.. ఈ ఫోన్‌కు సంబంధించిన పలు వివరాలు లీక్ అయ్యాయి. ఏవేంటో ఓసారి చూద్దాం.
iQOO Z7 Pro 5G Specs:
ఐకూ జెడ్ 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 SoC ప్రాసెసర్ ఉంటుంది. ఇది 4nm-ఆధారిత మధ్య శ్రేణి ప్రాసెసర్. 2.8GHz వరకు క్లాక్ చేయబడిన రెండు ARM కార్టెక్స్-A715 పనితీరు కోర్లు మరియు ఆరు కార్టెక్స్‌లను కలిగి ఉంటుంది.
iQOO Z7 Pro 5G Camera:
ఐకూ జెడ్ 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఒకటి 64MP ప్రైమరీ కాగా.. మరొకటి 2MP సెన్సార్. ముందువైపు 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.
Also Read: Photo Vastu Tips: ఇంట్లో పిల్లల ఫోటోలను ఆ దిశలో మాత్రమే పెట్టాలి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
iQOO Z7 Pro 5G Price:
ఐకూ జెడ్ 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణిస్తున్నారు. అంటే ఈ ఫోన్ ధర మరీ ఎక్కువగా ఉండదు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 25 వేల నుంచి 30 వేల మధ్య ఉంటుందని అంచనా. ఈ ఫోన్ గరిష్టంగా 128జీబీ + 256 జీబీ వస్తుంది.
iQOO Z7 Pro 5G Battery:
ఐకూ జెడ్ 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లో 66 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు. ఈ ఫోన్ అమెజాన్‌లో అమ్మకానికి ఉండనుంది.