Rahul Dravid Signs New Contract: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఉత్కంఠ వీడింది. టీమిండియా కోచ్‌గా కొనసాగేందుకు ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ అంగీకరించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ బుధవారం అధికారికంగా వెల్లడించింది. టీమిండియా (సీనియర్ మెన్) హెడ్ కోచ్ మరియు సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్ట్‌లను పొడిగించాం అని బీసీసీఐ తన ఎక్స్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ ద్రవిడ్‌తో పాటు సహాయక సిబ్బంది పదవీకాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌లు యధావిధిగా కొనసాగనున్నారు. అయితే ద్రవిడ్ కోచింగ్ బృందం ఎప్పటివరకు ఈ పదవిలో ఉంటారనే విషయం మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న విషయం తెలిసిందే. అప్పటివరకు ఇదే కోచింగ్ బృందం కొనసాగనుంది. దక్షిణాఫ్రికా పర్యటనతో ద్రవిడ్ బృందం భారత జట్టుతో కలుస్తుంది.
Also Read: Padi Kaushik Reddy: బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు!
వన్డే ప్రపంచకప్ 2023తో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. దీంతో హెడ్ కోచ్‌గా కొనసాగమని బీసీసీఐ కోరింది. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కార్ కూడా హెడ్ కోచ్‌గా మిస్టర్ డిపెండబులే ఉండాలనుకున్నారు. అయితే ఆ పదవిలో కొనసాగేందుకు ముందుగా ద్రవిడ్ విముఖత చూపించిన ద్రవిడ్.. చివరికి అంగీకరించాడు. దాంతో టీమిండియా తదుపరి హెడ్ కోచ్ ఎవరన్న ఉత్కంఠతకు తెరపడింది.
NEWS 🚨 -BCCI announces extension of contracts for Head Coach and Support Staff, Team India (Senior Men)
More details here – https://t.co/rtLoyCIEmi #TeamIndia
— BCCI (@BCCI) November 29, 2023