సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే చిత్ర షూటింగ్ ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమైన యాగంటి లో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ సంబంధించి హీరోయిన్ రష్మిక మందానాతో పాటు, నటుడు అజయ్ మరికొందరు ఇప్పటికే నంద్యాలకు చేరుకున్నారు.
Also Read: Kurnool GGH: కర్నూలులో దారుణం.. ఆపరేషన్ థియేటర్‌లో మూగ, చెవిటి బాలుడు నరకయాతన..!
సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాలు యంగంటి ప్రాంతంలో చిత్రీకరిస్తునట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్లు చూడగా ఇప్పటికే సినిమాలో నటిస్తున్న నటీనటులు నాడ్యాల్ లోని సూరజ్ గ్రాండ్ లో బస చేసినట్లు తెలిసింది. ఇక ఈ సినిమాకి మరొక టీజర్ వదిలి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రేక్షకుల దేవుళ్ళ అంచనాలను రీచ్ అయ్యేలా సినిమాను చేసి భారీ సక్సెస్ ని సాధించాలని చిత్ర బృందం ప్రయతినిస్తుంది.
Also Read: Nagari YSRCP: హాట్ టాపిక్‌గా మారిన ‘నగరి’ అసమ్మతి నేతల వ్యవహారం.. సీఎంవో నుంచి వెనక్కి..!
ఇకపోతే తాజాగా పుష్ప పార్ట్ 3 కూడా ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేస్తుంది. 15 ఆగష్టు, 2024 నాటికి పుష్ప – 2 రిలీజ్ అవుతుందని ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. చూడాలి మరి అప్పటికి సినిమా విడుదల అవుతుందో లేదో. దీనికి కారణం ఎన్నికల నేపధ్యం కావడమే. దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఉండడంతో ఇప్పటికే అనేక సినిమాలు రిలీజ్ డేట్లను పోస్ట్పోన్ చేసే ఆలోచనలో ఉన్నాయి.