Rashmika: అల్లు అర్జున్, సుకుమార్ సినిమా ‘పుష్ప’ సినిమా ఇప్పుడు రష్యాలో రిలీజ్ అయి అక్కడ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. అందు తగ్గట్లే ‘పుష్ప’ టీమ్ రష్యాలో సినిమా విడుదలైన చోట్ల పర్యటిస్తూ మీడియాతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉందే ఈ సినిమా సూపర్ హిట్ అయిన పాటల్లో రశ్మిక ‘సామి సామి’ పాట ఇండియాలో ఆడియన్స్‌ని చిందేయించింది.
Movies Release Dates: సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ ఖరారు అయ్యాయా!?
ఇప్పుడు ఆ ఫీవర్ రష్యాలోనూ ఆరంభం అయింది. ట్రెండ్‌ను ఫాలో అవుతూ రష్యన్ ఫ్యాన్స్ సామి సామి పాటకు చిందులేస్తున్నారు. ‘సామి సామి’ పాట అంటే పడిచచ్చే ఓ వీరాభిమాని రష్యన్ కుటుంబం డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. మరి ఇండియాలోలాగే రష్యా ఆడియన్స్ కూడా తగ్గేదే లే అంటారేమో చూడాలి.