Movies Release Dates: తెలుగువారికి బాగా ఇష్టమైన పండగ సంక్రాంతి. ఈ సీజన్‌లో రిలీజ్ అయ్యా సినిమాలకూ అంతే క్రేజ్ ఉంటుంది. అలాంటి సంక్రాంతికి ఇంకా 40 రోజుల టైమ్ ఉంది. ఇక ఈ పండగ సీజన్ లో పోటీపడే సినిమాలు ఏమిటన్నది ఇప్పకికే తేలిపోయింది. సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో మెగాస్టార్ చిరంజీవి నటించి ‘వాల్తేర్ వీరయ్య’, బాక్సాఫీస్ బొనంజా నందమూరి బాలకృష్ణ సినిమా ‘వీరసింహారెడ్డి’ తో పాటు, ఇళయ దళపతి విజయ్ తమిళ సినిమా ‘వారిసు’ తెలుగు డబ్బింగ్ ‘వారసుడు’, అజిత్ నటించిన తమిళ డబ్బింగ్ ‘తునివు’ విడుదలకు రెడీ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికే పలు వివాదాలు నడుస్తున్నాయి. తెలుగు సినిమాలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని తెలుగు నిర్మాతల మండలి అధికారికంగా నోట్ కూడా విడుదల చేసింది. దానికి అనుగుణంగా విడుదల కాబోయే చిత్రాలకు థియేటర్ల కేటాయింపు జరగాలని కోరింది. అయితే ఇవాళ ప్రాంతీయ సినిమా అనేది ఇండియన్ సినిమాగా మారిన నేపథ్యంలో అన్నీ సినిమాలు ఒకటేనని కొంతమంది సీనియర్ అండ్ యాక్టీవ్ నిర్మాతలు తేల్చేశారు. దాంతో సంక్రాంతికి రాబోయే సినిమాలలో చిరంజీవి, బాలకృష్ణ, విజయ్ సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి థియేటర్లు లభించనున్నట్లు వినికిడి. ఇదిలా ఉంటే ఈ సినిమాల విడుదల విషయంలో కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తున్నారు మేకర్స్. ప్రతి సినిమా విడుదలకు మధ్య ఓ రోజు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
OTT Updates: ‘ఊర్వశివో రాక్షసివో’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..!!
దీని ప్రకారం అజిత్ నటించిన ‘తునివు’ సినిమాను జనవరి 11న విడుదల చేయాలని, విజయ్ ‘వారసుడు’ జనవరి 12న విడుదలవుతుందని, అదే రోజున బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ రిలీజ్ కానుందని అంటున్నారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గా చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ జనవరి 13 న రిలీజ్ కానుందట. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. టాలీవుడ్ టాప్ హీరోలు నటించిన సినిమాలు కావటంతో ఈ రెండు సినిమాలకు దాదాపు సమ సంఖ్యలో థియేటర్లను కేటాయించేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ తేదీలు నిజంగానే ఖరారయ్యాయా? అయితే వీటిని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారనన్నది వేచి చూడాలి.