ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ బాగా పాపులర్ అయ్యారు.తాజాగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డ్ వచ్చింది. తెలుగులో ఏ హీరోకి అందని గౌరవం అల్లు అర్జున్ కి దక్కింది. దీనితో నేషనల్ వైడ్ గా అల్లు అర్జున్ పేరు మారుమ్రోగిపోతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. తమ అభిమాన హీరోకి నేషనల్ అవార్డు రావటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా వున్నారు.. పుష్ప సినిమాకు నేషనల్ అవార్డ్స్ రావడంతో పుష్ప -2 అంచనాలు భారీగా పెరిగాయి. పుష్ప 2 రిలీజ్ కోసం ప్రేక్షకులు,అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు..
పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న పుష్ప 2 లో కూడా అల్లు అర్జున్ కి జోడీగా నటిస్తోంది.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.భారీ అంచనాలున్న ఈ సినిమా పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి డైలాగ్స్ లీక్ అయ్యాయి. నేడు అభిమానుల కోసం పుష్ప-2 సినిమా షూటింగ్ వీడియోను అల్లు అర్జున్ షేర్ చేయగా.. అందులో సుకుమార్,అల్లుఅర్జున్ తో స్క్రిప్ట్ గురించి చర్చించారు. దాన్ని స్క్రీన్ షాట్ తీసిన కొందరు ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.. అందులో ‘ముందు అయితే నీకు, షెకావత్ కి గొడవ మచ్చా.. కానీ ఇప్పుడు సిండికేట్ కూడా ఇన్వాల్వ్ అయింది’ అని కేశవ కోసం డైలాగ్ రాసినట్లు అయితే ఉంది.దీంతో పుష్ప-2లో పుష్పరాజ్ మరియు షెకావత్ మధ్య వచ్చే సీన్స్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఈ డైలాగ్ బాగా వైరల్‌గా మారింది. అంతే కాదు ఈ పుష్ప 2లో ఇలాంటి లెంగ్తీ డైలాగ్స్ చాలానే ఉన్నాయని సమాచారం.తాజాగా లీకైన కేశవ్ డైలాగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.