ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడికి ఇన్‌ఫ్రంట్ దేరీజ్ క్రోకడైల్ ఫెస్టివలా? ఇన్నేళ్ళలో ఎన్నడూ లేని కొత్త టాస్క్ ఆయన ముందుకు వచ్చిందా? ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే… చివరికి సొంత కార్యకర్తలే నిలదీసే పరిస్థితి వస్తుందా? ఇంతకీ ఏంటా కొత్త టార్గెట్? మాథవ్ మీద అంత ప్రెజర్ ఎందుకు బిల్డ్ అవుతోంది? ఏపీ బీజేపీలో ఇన్నాళ్ళు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. కూటమిలో వాటాల ప్రస్తావన సీరియస్ అవడంతో… మేమేంటో కూడా నిరూపించుకోవాలని…
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి ఏపీ ఆర్థిక అంశాలపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల ప్రకటన విషయంలో కేంద్రం తీరుపై పురంధేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ అప్పు రూ. 4.42 లక్షల కోట్లేనని కేంద్రం చెప్పడంతో ఏపీలో బీజేపీకి ఇబ్బందిగా మారిందని లేఖలో పురంధేశ్వరి పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్, సనాతాన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలనడం హైయమైన చర్య అని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తలపెట్టిన మహాధర్మలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఒంగోలు కలెక్టరేట్ దగ్గర ఆందోళన నిర్వహించారు. సర్పంచ్ లకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ గళం విప్పిన తరువాత వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు చెప్పారని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు