Prithvi Shaw Double Century: డబుల్ సెంచరీ చేసినా.. టీమిండియాలో చోటు గురించి ఆలోచించడం లేదు: పృథ్వీ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithvi Shaw Hits Double Century for Northamptonshire: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో భారత యువ క్రికెటర్ పృథ్వీ షా అదరగొట్టాడు. నార్తంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల షా.. డబుల్ సెంచరీతో చెలరేగాడు. సోమర్‌సెట్‌తో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో 153 బంతులు ఆడి.. 28 ఫోర్లు, 11 సిక్స్‌లతో 244 పరుగులు చేశాడు. షా అసాధారణ బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 415 రన్స్ చేసింది. ఆపై సోమర్‌సెట్ 45.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్ అయింది. డబుల్ సెంచరీ చేసిన షా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.
తాజాగా జట్టులో తాను ఎంపిక కాకపోవడంపై పృథ్వీ షా స్పందించాడు. టీమిండియాలోకి తీసుకొనే విషయంలో సెలక్టర్ల అభిప్రాయంపై తాను ఏమాత్రం బాధపడటంలేదన్నాడు. ‘బీసీసీఐ సెలక్టర్లు నా గురించి ఏం అనుకుంటున్నారని ఏమాత్రం ఆలోచించడం లేదు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ సమయాన్ని ఆద్భుతంగా ఆస్వాదించాలనుకుంటున్నా. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్‌తో చక్కటి సమయం గడుపుతున్నా. నార్తంప్టన్‌షైర్ నాకు అవకాశం ఇచ్చింది. వారు నన్ను బాగా చూసుకుంటున్నారు. ఆటను ఎంజాయ్ చేస్తున్నా. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తా’ అని షా చెప్పుకొచ్చాడు.
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
యువ క్రికెటర్ పృథ్వీ షా భారత్ తరఫున మ్యాచ్ ఆడక చాలా రోజులు అయింది. జులై 2021 తర్వాత అతడు భారత జట్టు తరపున బరిలోకి దిగలేదు. షా భారత్ తరఫున మూడు ఫార్మాట్‌లలో ఆడాడు. అయితే వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో విఫలం అయ్యాడు. త్వరగా పెవిలియన్ చేరి.. మూల్యం చెల్లించుకున్నాడు. పృథ్వీ షా భారత్ తరఫున 5 టెస్టులు, 6 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 339, వన్డేల్లో 189 రన్స్ చేసిన షా.. ఒక టీ20 మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. టెస్టుల్లో షా ఓకే సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు చేశాడు.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!