PSLV-C59 Launch Postponed: చివరి నిమిషంలో PSLV-C59 రాకెట్ ప్రయోగం వాయిదా.. కారణం ఇదే..!
- PSLV-C59 రాకెట్ ప్రయోగం వాయిదా..
- షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 4.12 గంటలకు ప్రయోగం..
- ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తింపు..
- చివరి క్షణాల్లో ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేసిన ఇస్త్రో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSLV-C59 Launch Postponed: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ రోజు నిర్వహించాల్సిన PSLV-C59 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసింది.. కౌంట్‌డౌన్ ప్రక్రియ మంగళవారం రోజు ప్రారంభం కాగా.. కౌంట్‌డౌన్‌ను విజయవంతంగా ముగించుకుని ఈ రోజు సాయంత్రం 4.12 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది.. అయితే, చివరి క్షణాల్లో ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఇస్త్రో.. శాటిలైట్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన ఇస్త్రో శాస్త్రవేత్తలు.. ఆ వెంటనే కౌంట్ డౌన్ ప్రక్రియను నిలిపివేశారు. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.. ప్రయోగానికి ముందు అన్ని విభాగాలను కంప్యూటర్ తో పరీక్షలు నిర్వహించారు.. అయితే, ఉపగ్రహంలో లోపం ఉన్నట్లు కంప్యూటర్ గుర్తించింది.. దీనిపై శాస్త్రవేత్తల సమీక్షించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. ఆ తర్వాత కౌంట్‌డౌన్ ప్రక్రియ నిలిపివేసి.. ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.. ఇక, రేపు సాయంత్రం అనగా గురువారం రోజు సాయంత్రం 4.12 గంటలకు PSLV-C59 రాకెట్‌ను ప్రయోగించనుంది ఇస్త్రో..
Read Also: Maharashtra CM: ఫడ్నవిస్‌తో భేటీకానున్న షిండే.. దేనికోసమంటే..!
Also Read
- CM Chandrababu: నా గ్రేట్ విజన్‌కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
- Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్‌నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
కాగా, భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైన వేళ.. పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాక్షింస్తూ.. సూళ్లూరుపేటలోని చంగాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ పూజలు నిర్వహించిన విషయం విదితమే.. రాకెట్ ప్రయోగ కౌంట్‌డౌన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని.. సూర్యునిపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టడమే ఈ ఉపగ్రహ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇక, PSLV C-60 రాకెట్‌ను కూడా ఈ నెలలోనే ప్రయోగిస్తామని.. చంద్రయాన్-4 రాకెట్ ప్రయోగం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని.. గగన్‌యాన్ రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు ఈ నెలలో ఇస్రో హెడ్‌క్వార్టర్స్‌లో మొదలవుతాయని ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ ప్రకటించిన విషయం విదితమే.. అయితే, ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించిన ఇస్రో కౌంట్‌డౌన్‌ను నిలిపివేసి.. PSLV-C59 రాకెట్ ప్రయోగాన్ని రేపు సాయంత్రం 4.12 గంటలకు పోస్ట్‌పోన్ చేసిన విషయం విదితమే.. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 మిషన్‌ను ప్రయోగిస్తున్నారు. నింగిలోకి 2 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉపగ్రహాలు వెళ్లనున్నాయి.
Due to an anomaly detected in PROBA-3 spacecraft PSLV-C59/PROBA-3 launch rescheduled to tomorrow at 16:12 hours.
— ISRO (@isro) December 4, 2024
తాజావార్తలు
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
-
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
-
Wamika Gabbi : ‘DC’తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
-
CM Chandrababu: నా గ్రేట్ విజన్‌కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!