శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ59 వాహక నౌక నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4.04 గంటలకు వాహక నౌక కక్ష్యలోకి ప్రవేశించింది. సాంకేతిక లోపం కారణంగా బుధవారం చేపట్టాల్సిన ప్రయోగం నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రయోగం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ తెలిపారు. ప్రయోగం విజయవంతంతో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ‘రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అనుకున్న కక్షలోకి ప్రోబా-3 ఉపగ్రహాన్ని…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ రోజు నిర్వహించాల్సిన PSLV-C59 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసింది.. కౌంట్‌డౌన్ ప్రక్రియ మంగళవారం రోజు ప్రారంభం కాగా.. కౌంట్‌డౌన్‌ను విజయవంతంగా ముగించుకుని ఈ రోజు సాయంత్రం 4.12 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది.. అయితే, చివరి క్షణాల్లో ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఇస్త్రో.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతం చేసిన ఇస్రో.. ఇటు కమర్షియల్ రాకెట్ ప్రయోగాలపై కూడా దృష్టిసారించింది.. ఇప్పటికే పలు దేశాలకు చెందిన ఉపగ్రహాలను.. ఇతర సంస్థలకు చెందిన ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి చేర్చి సత్తా చాటింది..