Priyanka Gandhi: బీజేపీ వల్లే లక్షలాది మంది యువత భవిష్యత్తు నాశనమైంది..
- యూజీసీ నెట్- నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్..
- బీజేపీ పాలనలో లక్షలాది మంది యువత భవిష్యత్త్ నాశనమైంది..
- తక్షణమే 24 లక్షల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలి: ప్రియాంక గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: యూజీసీ నెట్, నీట్ పేపర్ లీక్ వ్యవహారం రోజురోజుకూ తీవ్ర వివాదానికి దారి తీస్తుంది. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో యూజీసీ నెట్ పరీక్షను కూడా ఎన్టీఏ రద్దు చేసింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించింది. బీజేపీ పాలనలో లక్షలాది మంది యువత భవిష్యత్త్ నాశనం అయిందని ఆరోపించింది. ఈ లీకేజీ కుంభకోణంలో 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష స్కామ్ కి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన తెలియజేస్తుందని ప్రియాంక గాంధీ అన్నారు.
Read Also: Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..!
Also Read
ఇక, బీజేపీ హయాంలో రిక్రూట్మెంట్లో అవినీతి, పేపర్ లీక్‌లు, ఎడ్యుకేషన్ లో స్కామ్‌లు జరిగడంతో.. దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నాయని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఈ అవినీతిని వెంటనే ఆపాలి.. తక్షణమే 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగేలా నీట్ పరీక్షలో జరిగిన కుంభకోణంలోని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక, ఎక్స్ వేదికగా పేపర్ లీక్ గురించి ప్రియాంక గాంధీ మరొక పోస్ట్ చేశారు. గత ఐదేళ్లలో దేశంలో 43 రిక్రూట్మెంట్ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి.. బీజేపీ పాలనలో, పేపర్ లీకులు మన దేశ జాతీయ సమస్యగా మారింది.. ఇది ఇప్పటి వరకు కోట్లాది యువత భవిష్యత్తును నాశనం చేసిందన్నారు.
Read Also: Andhra Pradesh: తెలుగు సినిమా రంగాన్ని ఏపీకి తరలించడం సాధ్యమా?
అయితే, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన దేశం భారత్.. మన దగ్గర అత్యధిక యువతతో కూడిన జనాభా ఉంది అని ప్రియాంక గాంధీ తెలిపారు. ఈ యువతను నైపుణ్యం, సమర్థులుగా మార్చే బదులు బీజేపీ ప్రభుత్వం వారిని బలహీనపరుస్తోంది అని ఆరోపించింది. నీట్ పరీక్ష మే 5న నిర్వహించబడింది.. ఇందులో సుమారు 24 లక్షల మంది విద్యార్థులు ఎక్జామ్ రాశారు.. అయితే జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత పేపర్ లీక్ అయిందనే ఆరోపణలు వచ్చాయి.
आज देश भर में भारतीय राष्ट्रीय कांग्रेस के साथियों ने NEET परीक्षा घोटाले के खिलाफ विरोध-प्रदर्शन किया। भाजपा राज में भर्तियों में बेतहाशा भ्रष्टाचार, पेपर लीक और शैक्षणिक घोटाले देश के भविष्य को अंधकार में धकेल रहे हैं। भ्रष्टाचार का यह खेल तत्काल बंद होना चाहिए।
हमारी मांग… pic.twitter.com/uGJcxkZlRA
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 21, 2024
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!