Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- ఖైరతాబాద్‌లో సఫలమైన కార్మిక సంఘాల చర్చలు
- డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల హామీలు
- సంక్షేమ బోర్డు, ఛార్జీల పెంపుపై కమిటీ
- సమ్మె రద్దుతో ప్రయాణికులకు భారీ ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Auto Strike : నేటి అర్ధరాత్రి నుంచి చేపట్టాలనుకున్న రాష్ట్రవ్యాప్త సమ్మెను ఆటో, క్యాబ్ కార్మికులు విరమించుకున్నారు. రవాణా శాఖ అధికారులు, కార్మిక సంఘాల నాయకుల మధ్య ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు.
ఫలించిన చర్చలు.. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం
ఈ సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లపై అధికారులు సానుకూలంగా స్పందించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ చర్చల్లో జూమ్ (Zoom) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. మంత్రి , అధికారుల హామీతో సంతృప్తి చెందిన కార్మిక నాయకులు సమ్మెను విరమించేందుకు అంగీకరించారు.
Also Read
త్వరలోనే జీవో విడుదల చేయాలని డిమాండ్
తమ ప్రధాన డిమాండ్లైన ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఛార్జీల పెంపునకు కమిటీ, ఎలక్ట్రిక్ వాహనాల మార్పిడికి ఆర్థిక సహాయం వంటి అంశాలపై ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు (G.O.) విడుదల చేయాలని కార్మిక సంఘాల నాయకులు ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో నేటి అర్ధరాత్రి నుంచి జరగాల్సిన ఆటో, క్యాబ్, స్కూల్ బస్సుల సమ్మె రద్దు కావడంతో ప్రజలు, ముఖ్యంగా నిత్య ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!