Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- బంగ్లాదేశ్‌లోని హిందూ కుటుంబానికి చెందిన నలుగురి హత్య..
- ఇంటి పైకప్పుపై డ్రగ్స్ తీసుకుంటుండగా చూశారని హత్యలు..
- హత్యల తర్వాత నిందితులు 6–7 గంటలు ఇంట్లోనే ..
- ఇంట్లో ఖర్జూరాలు, దోసకాయలు తిన్న ఆనవాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబంలోని నలుగురు దారుణహత్యకు గురయ్యారు. రంగ్‌పూర్‌లోని వారి ఇంట్లో శవాలుగా కనిపించారు. ఈ కేసులో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి పైకప్పుపై ఇద్దరు వ్యక్తులు యాబా అనే మెథాంఫెటమైన్ డ్రగ్‌ను తీసుకుంటుండగా కుటుంబంలోని ఒక వ్యక్తి చూడటంతో, ఈ గుట్టు ఎక్కడ బయటపడుతుందనే భయంతో కుటుంబం మొత్తాన్ని చంపేసినట్లు తేలింది. బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం.. హత్యల తర్వాత నిందితులు వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా దాదాపు 6-7 గంటల పాటు ఇంట్లోనే ఖర్జూరా, దోసకాయలు తిని, స్నానం చేసి వెళ్లినట్లు తెలిసింది.
ఈ కేసులో మగ్ధో, సిద్ధార్థ అనే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు రిటైర్డ్ రంగ్‌పూర్ జిల్లా స్కూల్ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత చక్రవర్తి (50), కుమార్తె ఆగామి చక్రవర్తి ప్రార్థి (23), 12 ఏళ్ల కుమారుడు ప్రియమ్ చక్రవర్తిలను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుటుంబానికి ఎవరితో గొడవలు, శత్రుత్వం లేదని తేలింది. రంగ్‌పూర్ మెట్రోపాలిటన్ పోలీసులు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, డిటెక్టివ్ బ్రాంచ్ కలిసి దర్యాప్తు చేసి అనుమానితులను పట్టుకున్నారు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
రంగ్‌పూర్ పోలీస్ కమిషనర్ మహమ్మద్ అబ్దుల్ మాబుద్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఇద్దరు అనుమానితులు పక్కింటి భవనం పై నుంచి గణపతి ఇంటి పైకప్పు పైకి వచ్చారు. శబ్ధం వస్తుందని పైకి వెళ్లిన గణపతి, ఇద్దరు నిందితుల్ని ప్రశ్నించాడు. దీంతో తాము డ్రగ్స్ తీసుకున్న విషయం బయటకు వస్తుందని గొంతు నులిమి హత్య చేశారు. గొడవ శబ్ధాలు విన్న గణపతి భార్య ప్రీతిలత కూడా ఇలాగే చంపేశారు. దీని తర్వాత కుమార్తె ఆగామి, కుమారుడి ప్రియమ్‌ను కూడా హత్య చేశారు. ప్రియమ్‌కు నిందితుల్లో ఒకరితో పరిచయం ఉందని అనుమానిస్తున్నారు. ప్రియమ్, సిద్ధార్థ తమ్ముడు అపూర్వకు స్నేహితుడని, తమ గుర్తింపును బయటపెడతాడనే భయంతో అతడిని చంపి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..