Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Duleep Trophy 2026 Debut: రెడ్‌బాల్ క్రికెట్లో భారత సంచలనం వైభవ్ సూర్యవంశీకి తీవ్ర నిరాశ ఎదురైంది. దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ ఫైనల్లో సింగిల్ డిజిట్‌కే బుడ్డోడు పెవిలియన్ చేరాడు. ఈస్ట్ జోన్ తరఫున తన తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్న వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 8 పరుగులకే అవుట్ అయ్యాడు. రెడ్‌బాల్ క్రికెట్లో తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చినప్పటికీ.. బుడ్డోడు నిరాశ పరిచాడు.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 2 వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో ఈస్ట్ జోన్ బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ ఆరంభంలో వైభవ్ దూకుడుగా ఆడాడు. రెండో ఓవర్లో బౌలర్ బిశ్వర్జిత్ కొంతౌజామ్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. దీంతో 15 ఏళ్ల వైభవ్ 6 బంతుల్లో 8 పరుగులకే తన తొలి దులీప్ ట్రోఫీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐపీఎల్ 2026, భారత్ తరఫున మెరుపు బ్యాటింగ్‌తో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న బుడ్డోడు.. రెడ్‌బాల్ క్రికెట్లో ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఈ టోర్నీలో ఈస్ట్ జోన్‌కు నాయకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు. అయితే తొలి మ్యాచ్‌లోనే 8 పరుగులకు ఔటవడం అతడికి నిరాశ కలిగించే అంశంగా మారింది. వైభవ్ ఔటైన తర్వాత ఈస్ట్ జోన్ మరో వికెట్ కూడా కోల్పోయింది. వైభవ్ సింగిల్ డిజిట్‌కే అవుట్ అవ్వడంతో ఫాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేశారు. మరో క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్, వెస్ట్ జోన్ మధ్య మ్యాచ్ కూడా కొనసాగుతోంది.
దులీప్ ట్రోఫీ వంటి ప్రతిష్ఠాత్మక దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీ యువ ఆటగాళ్లకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే గొప్ప వేదిక. తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విఫలమైనప్పటికీ.. టోర్నీలో అతడికి ఇంకా అవకాశాలు లభిస్తే రెడ్‌బాల్ క్రికెట్‌కు తనను తాను ఎలా మార్చుకుంటాడన్నది చూడాలి.
🔴 VAIBHAV SURYAVANSHI DISMISSED FOR 8 RUNS 🤯
Duleep Trophy: East Zone vice-captain Vaibhav Suryavanshi dismissed for 8 (6). pic.twitter.com/8J5oa1GhoS
— Sam (@cricsam02) August 23, 2026
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..