కర్ణాటకలో ఎన్నికలను సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే నేడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా బెంగళూరు మైదానంలో జరుగుతున్న నా నాయకి అనే మహిళా సమావేశాన్ని (ఉమెన్స్ కన్వెన్షన్) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ప్రియాంకా గాంధీ భారీ కటౌట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో వస్తే.. 200 యూనిట్‌ల వరకు విద్యుత్ ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మహిళల కోసం ప్రత్యేక ప్రణాళిక విడుదల కోసం ప్రియాంకా గాంధీ బెంగళూరుకు రానున్నారు.
Also Read : BJP : ప్రారంభమైన బీజేపీ కార్యవర్గ సమావేశాలు
నా నాయకి సమావేశంలో కర్ణాటకలో ఎక్కువ మంది మహిళా ఓటర్లను ఆకర్షించే ఉద్దేశ్యంతో మహిళల కోసం ప్రత్యేక ప్రణాళికను కాంగ్రెస్ విడుదల చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్‌లో జరిగే ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ మహిళల కోసం ప్రత్యేక ప్రణాళిక విడుదల కానుంది. గ్రామ పంచాయతీ, సహకార సంఘాలలో మహిళా నాయకురాలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దాదాపు 1 లక్షల మంది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా సంఘం ఈ సమావేశాన్ని నిర్వహింస్తోంది. వివిధ పంచాయతీల సహకార సంఘాలకు పోటీ చేసిన మహిళలతో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రతి బూత్ లేదా సంఘం నుండి 3 నుండి 10 మంది మహిళల సమావేశానికి హాజరుకావడానికి పిలుపునిచ్చారు.
Also Read : Priyanka Jawalkar: పవన్ కళ్యాణ్‌తో చచ్చినా చేయను.. ప్రియాంకా బాంబ్