టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షాకు నిలకడలేకపోవడంతో జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. ఐపీఎల్2023 సీజన్‌లో సత్తా చాటి తిరిగి జట్టులో స్థానం సంపాదించుకుంటాడు అనుకుంటే ఘోరంగా విఫలం అయ్యాడు. ఇప్పుడు పేలవ ఫామ్‌తో షా సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో తన పూర్వపు ఫామ్‌ను అందుకోవడంతో పాటు టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవాలన్న కసితో ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. నార్తాంప్టంన్ షైర్ టీమ్ తో జత కట్టాడు.
Read Also: Trending News: ఒక ఇంజక్షన్కు బదులు మరొక ఇంజక్షన్.. శాశ్వతంగా ఇక లేనట్టే..!
అయితే.. తొలి మ్యాచ్‌లోనే పృథ్వీ షా దురదృష్టకరంగా అవుట్ అయ్యాడు. రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా శుక్రవారం గ్లౌసెస్టర్‌షైర్,నార్తాంప్టంన్ షైర్ జట్లు తలపడ్డాయి. నార్తాంప్టన్ షైర్ టీమ్ తరుపున అరంగేట్రం చేసిన షా 35 బంతులు ఎదుర్కొని కేవలం 2 ఫోర్లు, సిక్సర్‌తో 34 రన్స్ చేశాడు. క్రీజులో సెట్ అయ్యాడు ఇక భారీ స్కోరు చేస్తాడు అని అనుకునే క్రమంలో వైరటీగా ఔట్ అయ్యాడు. నార్తాంప్టంన్ షైర్ ఇన్సింగ్స్ 16వ ఓవర్లను గ్లౌసెస్టర్‌షైర్ బౌలర్ వాన్ మికెరన్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతిని బౌన్సర్ గా వేశాడు.. స్ట్రైకింగ్‌లో ఉన్న పృథ్వీ షా పుల్ షాట్ ఆడబోయి.. బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు.
Read Also: Glenn McGrath: వన్డే వరల్డ్ కప్లో సెమీస్కు చేరుకునే టీమ్లు ఇవే..!
ఈ క్రమంలో అతడి కాలు వికెట్లను తాకడంతో బెయిల్స్ కింద పడిపోయాయి. దీంతో అతడు హిట్‌వికెట్‌గా డగౌట్ కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. దురదృష్టం నీ వెన్నంటే ఉందిగా బ్రో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో గ్లౌసెస్టర్‌షైర్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గ్లౌసెస్టర్‌షైర్ 48.4 ఓవర్లలో 278 రన్స్ చేయగా.. పరుగుల లక్ష్య చేధనలో నార్తాంప్టంన్ షైర్ 48.1 ఓవర్లలో కేవలం 255 పరుగులకే పరిమితమైంది.
HIT WICKET!!!! 🚀
Paul van Meekeren with a fierce bumper that wipes out Prithvi Shaw who kicks his stumps on the way down. What a delivery! Shaw goes for 34.
Northants 54/6.#GoGlos 💛🖤 pic.twitter.com/EMYD30j3vy
— Gloucestershire Cricket (@Gloscricket) August 4, 2023