టీమిండియా యువ ఓపెనర్, నార్తంప్టన్‌షైర్ స్టార్ ప్లేయర్ పృథ్వీ షా రాయల్ లండన్ వన్డే కప్-2023 నుంచి అర్థంతరంగా తప్పుకున్నాడు. ఈ టోర్నీలో విధ్వంసకరమైన బ్యాటింగ్ తో డబుల్ సెంచరీతో పాటు ఓ సెంచరీ చేసి అద్భుతమైన ఫామ్ లో ఉన్న షా.. డర్హమ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు.
నార్తాంప్టంన్ షైర్ ఇన్సింగ్స్ 16వ ఓవర్లను గ్లౌసెస్టర్‌షైర్ బౌలర్ వాన్ మికెరన్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతిని బౌన్సర్ గా వేశాడు.. స్ట్రైకింగ్‌లో ఉన్న పృథ్వీ షా పుల్ షాట్ ఆడబోయి.. బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతడి కాలు వికెట్లను తాకడంతో బెయిల్స్ కింద పడిపోయాయి. దీంతో అతడు హిట్‌వికెట్‌గా డగౌట్ కు చేరుకున్నాడు.