న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగుల వద్ద భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఔటయ్యాడు. దీంతో.. సెంచరీని మిస్ చేసుకున్నాడు. గత ఆరేళ్లలో పంత్ టెస్టుల్లో ఏడోసారి 90-99 రన్స్ మధ్య ఔటయ్యాడు. నాలుగో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి నాలుగో వికెట్ కు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి భారత్ ను కష్టాల నుంచి గట్టెక్కించాడు.
బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా శివమ్ దూబే వచ్చే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.
సన్రైజర్స్ అభిమానులకు ఇదొక భారీ షాక్ అని చెప్పాలి. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఎడమ మడమ నొప్పి కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్లు ESPNcricinfo తెలిపింది. కాగా.. మినీ వేలంలో హసరంగను రూ. 1.5 కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా రిస్క్ తీసుకోకూడదని శ్రీలంక అతడికి పూర్తి విరామం ఇచ్చింది. ప్రస్తుతం హసరంగ శ్రీలంకలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఐపీఎల్ తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ను గాయాలు వదలడం లేదు. ఇప్పటికే జట్టు వరుస ఓటములతో ఇబ్బంది పడుతుండగా.. జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం అవుతున్నారు. తాజాగా.. మరో స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ దూరం కానున్నారు. గాయం కారణంగా ముంబైతో జరిగే మ్యాచ్కు ఆడటం కష్టమేనని టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తెలిపారు. అంతేకాకుండా.. అతను కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుందో చెప్పలేదు. కాగా.. ఈసీజన్ లో నాలుగు మ్యాచ్లు ఆడిన మార్ష్.. 71…
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ 'హ్యాండిల్డ్ ది బాల్' కారణంగా ఔట్ అయ్యాడు. దీంతో.. టెస్టు క్రికెట్‌లో ఈ విధంగా ఔటైన తొలి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. క్రికెట్‌లో అతి తక్కువగా కనిపించే ఘటనల్లో ఇదొకటి.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడంలో టీమిండియా విఫలమయ్యారని సునీల్ గవాస్కర్ అన్నారు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ ఓ తప్పుడు షాట్ ఆడి అవుట్ కావడం పెద్దదెబ్బ అన్నారు.
ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆసీస్ సారథి పాట్ కమిన్స్ మీడియాతో మాట్లాడినట్లుగానే చేశాడు. స్టేడియంలో 1 లక్ష 32 వేల మంది టీమిండియా తరుఫున సపోర్ట్ చేస్తారని.. అభిమానులను ఎలా ఆశ్చర్యపరచాలో తనకు, తమ జట్టుకు తెలుసన్నాడు. అనుకున్నట్లు గానే చేసి చూపించాడు. టీమిండియా ఎక్కువగా ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ ఔట్ చేసి స్టేడియంలో ఉన్న అభిమానులందరినీ పిన్ డ్రాప్ సైలంట్ చేసి చూపించాడు. కోహ్లీ ఔట్ అవ్వడంతో స్టేడియంలో ఉన్న అభిమానులతో…
వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ ప్రయాణం దాదాపు ముగిసినట్లే. ఈరోజు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై శ్రీలంక గెలిస్తే పాక్ కి సెమీస్ ఆశలుండేవి. కానీ, లంకను న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో పాకిస్తాన్ జట్టు సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లయింది.
ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు కష్టాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఆడి కష్టాల్లో ఉన్న ఇంగ్లీష్ జట్టుకు ఇదొక బిగ్ షాక్ అని చెప్పవచ్చు. తాజాగా.. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రీస్ టోప్లీ వేలికి గాయమైంది. దీంతో మొత్తం టోర్నమెంట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
నార్తాంప్టంన్ షైర్ ఇన్సింగ్స్ 16వ ఓవర్లను గ్లౌసెస్టర్‌షైర్ బౌలర్ వాన్ మికెరన్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతిని బౌన్సర్ గా వేశాడు.. స్ట్రైకింగ్‌లో ఉన్న పృథ్వీ షా పుల్ షాట్ ఆడబోయి.. బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతడి కాలు వికెట్లను తాకడంతో బెయిల్స్ కింద పడిపోయాయి. దీంతో అతడు హిట్‌వికెట్‌గా డగౌట్ కు చేరుకున్నాడు.