Child Abuse Case: హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై ఓ ప్రైవేట్ పాఠశాల ఆయా అమానుషంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పూర్ణిమ స్కూల్‌లో జరిగిన ఈ దారుణంపై విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకొని స్కూల్‌ను సీజ్ చేసింది. బాధిత చిన్నారి ప్రస్తుతం కోలుకుంటోంది. అభం శుభం తెలియని చిన్న పాపపై ఈ అమానుష హింస అందరిని కలచివేసింది. పాప తండ్రితో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ఆయా లక్ష్మి, చిన్నారిని స్కూల్ ప్రాంగణానికి…
Suicide: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మంగళవారం జరిగిన ఘటన కలకలం రేపింది. స్కూల్లో సార్ కొట్టాడని ఆరోపిస్తూ ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. బాధితులను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ఇద్దరికీ చికిత్స అందుతోంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏబీవీపీ నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. Daggupati Prasad: ఎమ్మెల్యే…
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుద్వాన్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు శంకర్, రెండో తరగతి విద్యార్థులపై కర్కశంగా ప్రవర్తించాడు.
Snake : హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఓ పాఠశాలలో బుధవారం ఉదయం విద్యార్థినులకు ఓ ఆందోళనకర అనుభవం ఎదురైంది. వారు రోజూ ఉపయోగించే టాయిలెట్‌లో ఓ భారీ కొండచిలువ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, కమలాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతిగృహంలోని టాయిలెట్‌లో దాదాపు 10 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ కనిపించింది. ఉదయం శుభ్రత పనులు జరుగుతున్న సమయంలో స్కూల్ సిబ్బంది ఈ దృశ్యాన్ని గుర్తించి షాక్‌కు…
Principal Slaps Teacher: గుజరాత్‌లోని భరూచ్ జిల్లా నవయుగ్ పాఠశాలలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పాఠశాల ప్రిన్సిపాల్ హితేంద్ర సింగ్ ఠాకూర్ తన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రాజేంద్ర పర్మార్‌ను 18 సార్లు చెంపదెబ్బ కొట్టిన వీడియో సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఈ సంఘటనపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఈ వివాదం పాఠశాలలో గణితం, సైన్స్ పాఠాలు బోధిస్తున్న రాజేంద్ర…
Viral Video: ప్రస్తుత రోజులలో ఏ సమయాన ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు సురక్షితంగా ఇంటికి వస్తారన్న నమ్మకం రోజురోజుకి లేకుండా అయిపోతుంది.. కాలక్రమన వెళ్తున్న మార్గంలో రోడ్ యాక్సిడెంట్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే.. మరికొందరు గుండెపోట్ల వల్ల మరణిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు స్కూల్లో అనుకోని సంఘటనల వల్ల వాళ్లు ప్రాణాలు కోల్పోవడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే, తాజాగా అహ్మదాబాద్ లో…
Boy Missing : వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. కొడంగల్ మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన పదవ తరగతి శివానంద్ గొల్ల (17) కనిపించకుండాపోవడంతో విద్యార్థి తల్లిదండ్రలు ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 5వ తేదీన టెలిగ్రాంలో తన బాబాయ్ ఫోనులోకి తన ఫొటో పంపించాడు. అయితే.. పాఠశాలలో ఉన్న విద్యార్జి…