లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పదవీకాలంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. తొలి టర్మ్‌లో అభివృద్ధి పథంలో కాంగ్రెస్ సృష్టించిన గుంతలను పూడ్చడానికే కాలయాపన చేయాల్సి వచ్చిందన్నారు. అప్పుడు దేశాభివృద్ధికి పునాది వేశాం, రెండో టర్మ్‌లో దేశం వేగంగా ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు.
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. విపక్షాల తీర్మానాన్ని నేను అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. విపక్షాలు చాలాకాలం పాటు విపక్షంలోనే ఉండాలనే సంకల్పం తీసుకున్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు. మరోవైపు... ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని దుయ్యబట్టారు. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందని…