దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో తల్లి భవానీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు అయింది. కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ శుక్రవారం సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇక కేసులో కర్ణాటక హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.