నీట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపింది. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారంతో అట్టుడుకుతోంది. పరీక్ష రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో తల్లి భవానీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు అయింది. కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ శుక్రవారం సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇక కేసులో కర్ణాటక హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.