ప్రభాస్ – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘స్పిరిట్’ రెగ్యులర్ షూట్ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎప్పుడెప్పుడు షూట్ మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. నేడు ఈ మూవీ భారీ ముహూర్త పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక ప్రభాస్‌తో పాటు హీరోయిన్ త్రుప్తి దిమ్రి, నిర్మాతలు భూషణ్ కుమార్ , వంగా ప్రణయ్, శివ్ చానానా కూడా పాల్గొన్నారు. అలాగే ప్రాజెక్ట్‌లో ఉన్న ప్రముఖ నటులు వివేక్ ఒబెరాయ్ , ప్రకాశ్ రాజ్ పేర్లు కూడా ఈ సందర్భంగా అధికారికంగా రీ-కన్‌ఫర్మ్ అయ్యాయి.
Also Read : Bigg Boss 9 Telugu: ఈ వారం నో ఎలిమినేషన్ నా..?
టీ–సిరీస్, వంగా పిక్చర్స్ బ్యానర్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, సందీప్ రెడ్డి వంగా స్టైల్లో ఒక రా, ఇంటెన్స్, పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. టీమ్ చెప్పినట్లుగా, ఇది ప్రభాస్ కెరీర్‌లోనే కాకుండా ఇండియన్ సినిమాకే “One Bad Habit”లాంటి పెద్దయ్యే సినిమా అవుతుందని నిర్మాతలు అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ముహూర్త ఫోటోలు హాట్ టాపిక్‌గా మారాయి.