Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” కల్కి 2898 AD “..ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో ప్రస్తుతం మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై అంచనాలు పెంచేసాయి.
Read Also :Mamitha Biju : మమిత బైజు చేసిన యాడ్ ను చూశారా?
ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి రీసెంట్ గా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా ట్రైలర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కానున్నట్లు సమాచారం.రిలీజ్ దగ్గరపడటంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించి రెండో ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.ఈ ట్రైలర్ నేడు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది.ఈ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.