కాంగ్రెస్ పార్టీకి విచక్షణ లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, అనుభవం లేదన్నారు బీఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ జనగామ జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అహంకారంతోనే చేసే పనితోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందని, రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ సర్కార్ కు అవకాశం ఇస్తారన్నారు. అది అవసరం, ఆవశ్యకత అని ఆయన వ్యాఖ్యానించారు. మరెన్నడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తదని ఆలోచన లేదని, కాంగ్రెస్ ది స్వయంకృత అపరాధమన్నారు.
Also Read : Diwali Surprise: ఉద్యోగులకు దీపావళి కానుకగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్.. టీ ఎస్టేట్ ఓనర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్..
కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు,బీసీలకు,మైనార్టీలకు దూరమైందని, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవడం తథ్యమని పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. ప్రజల చెంతకు పాలన, ప్రజల చెంతకు డబ్బు చెందేలా కేసీఆర్ పరిపాలన అందిస్తున్నారని, మూడవసారి ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం కాదు, రాజకీయాల కోసం కాదు, ప్రలోభాలతో కాదు ఇది చారిత్రక అవసరమన్‌నారు. కాంగ్రెసోళ్లు కలలుగంటున్నారని ఆయన విమర్శించారు. తాను పదవుల కోసం కాదని అధికారం కోసం కాదని పోస్టుల కోసం కాదని గౌరవం కోసం మాత్రమే బీఆర్‌ఎస్‌లోకి వచ్చానన్నారు. తనను ఎవ్వరు ఏమన్నా వారిది మూర్ఖత్వం అవుతుందని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.
Also Read : Bigg Boss 7 Telugu: శోభకు షాక్.. కెప్టెన్ అయిన ఆనందం కూడా లేకుండా చేశావ్ గా నాగ్ మామ!