మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్లల్లో దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో చిత్తూరు జిల్లాలో దానిమ్మను రైతులు అధికంగా పండిస్తున్నారు.. చిత్తూరు పలమనేరుకు చెందిన ఓ రైతు ఆధునాతన పద్ధతుల ద్వారా అధిక లాభాలను పొందుతూన్నాడు.. ఆయన దానిమ్మ మొక్కల పెంపకం పై సూచనలు కూడా ఇస్తున్నారు.. ఒకప్పుడు అతన్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్లు ఇప్పుడు అతని దగ్గర మెళుకువలు నేర్చుకుంటున్నారని ఆయన చెబుతున్నారు.. అతను ఎలా అధిక దిగుబడులు సాధిస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక అతను అవలంబిస్తున్న పద్ధతులు అధిక దిగుబడికి కారణం అవుతున్నాయి. ఐదెకరాల్లో నాగరాజు 1700 దానిమ్మ మొక్కలు నాటారు. క్రమం తప్పకుండా పర్యవేక్షణ సమయాని కి నీరు, ఎరువులు ఇవ్వడంతో పాటు ట్రూనిగ్ పద్ధతులు అవలంబించారు. దీంతో ఒక్కో చెట్టుకు 150 కాయల దిగుబడి సాధించారు. కిలో రూ.80 చొప్పున పొలం వద్దే వ్యాపారులకు విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు… పండుగల సీజన్ కావడంతో పండ్లకు మంచి ధర లభిస్తుంది. ప్రస్తుతం మరో కోతకు సిద్దంగా ఉంది. వినాయక చవితికి ముందుగా పంటను కోయాలని అనుకున్నాడు..
ఇక పండగ టైం లో ఎక్కడకు తీసుకెళ్లకుండానే లాభాలను పొందవచ్చునని ఆ రైతు చెబుతున్నాడు.. పండగ సీజన్లో కిలో రూ.120 చెల్లించి తీసుకెళతారని రవాణా ఖర్చులు కూడా ఉండవని ఆయన చెబుతున్నరు. ఐదెకరాల్లో 25 టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నారు. ఖర్చులు రూ.6 లక్షల వరకు అయిందని అన్ని ఖర్చులు పోగా రూ.18 లక్షలను పొందవచ్చునని ఆయన తెలిపారు.. వీటికి మధ్యలో మామిడి కూడా నాటడం వల్ల మరింత లాభాలను పొందవచ్చు అని ఆ రైతు చెబుతున్నారు..