High Court : డిప్లొమా కోర్సుల ఫీజు నియంత్రణపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. డిప్లొమా కోర్సులను ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తేవాలని గతేడాది సాంకేతిక విద్య శాఖ ప్రతిపాదనలు చేసింది. సాంకేతిక విద్యా శాఖ ప్రతిపాదనలపై గతేడాది ఫిబ్రవరి నుండి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కౌన్సెలింగ్ ప్రారంభమైనందున ఫీజులు పెంచాలని హైకోర్టులో 5 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల పిటిషన్ నమోద చేశాయి. వివరణ ఇవ్వాలని ఆదేశించినా విద్యా శాఖ కార్యదర్శి స్పందించక పోవడంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. వారం లోగా విద్యా శాఖ నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ తరుఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
Also Read : karnataka congress: జూన్ 21న ఢిల్లీకి కర్ణాటక మంత్రులు.. రమ్మని పిలిచిన కాంగ్రెస్ అధ్యక్షుడు
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
విద్యాశాఖ కార్యదర్శి వ్యక్తిగత హాజరుకు ప్రభుత్వ న్యాయవాది మినహాయింపు కోరారు. విద్యాశాఖ కార్యదర్శి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పాలిటెక్నిక్ కాలేజీలు కోరినట్లుగా ఫీజుల పెంపునకు అనుమతించక తప్పడం లేదని హైకోర్టు వెల్లడించింది. ఫీజు రూ.40వేలకు పెంచేందుకు 5 పాలిటెక్నిక్ కాలేజీలకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు. ప్రభుత్వం తక్కువగా ఫీజు ఖరారు చేస్తే విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని కాలేజీలకు హైకోర్టు షరతు విధించింది. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల ఫీజులపై తదుపరి విచారణ ఈనెల 26కి వాయిదా వేసింది హైకోర్టు.
Also Read : Sithara : ఆ పాటకి డాన్స్ తో అదరగొట్టిన సితార…
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!