Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- సరైన వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు
- ప్రకృతి కరుణించాలని ఆకాంక్షిస్తూ గాడిదలకు వివాహం
- తరతరాలుగా కళ్యాణదుర్గంలో సంప్రదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donkey Wedding Held in Kurlapalli Village for Rainfall: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని కుర్లపల్లి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామస్థులు వినూత్నంగా గాడిదలకు వివాహం జరిపించారు. చాలా కాలంగా సరైన వర్షాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ప్రకృతి కరుణించాలని ఆకాంక్షిస్తూ ఈ వివాహ తంతు జరిపించారు. హిందూ సంప్రదాయాల ప్రకారం అన్ని శాస్త్రోక్త విధానాలను పాటిస్తూ గాడిదలకు వివాహ వేడుక నిర్వహించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
గాడిదల వివాహ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వధూవరులుగా అలంకరించిన రెండు గాడిదలకు మంగళసూత్రం కట్టి, తలంబ్రాలు పోసి, హారతులు ఇచ్చి, ఆశీర్వదిస్తూ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా.. ఈ విశేష కార్యక్రమాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివచ్చారు. గ్రామంలో నెలకొన్న వర్షాభావం తొలగి.. చెరువులు, కుంటలు నీటితో నిండిపోవాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గ్రామస్థులు తెలిపారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ప్రకృతి అనుగ్రహం కోసం భక్తి, విశ్వాసాలతో ఈ సంప్రదాయాన్ని తరతరాలుగా కొనసాగిస్తున్నామని కుర్లపల్లి గ్రామ ప్రజలు చెప్పారు. ఇలాంటి ఆచారాలు గ్రామీణ ప్రాంతాల్లో పూర్వకాలం నుంచే కొనసాగుతున్నాయని అక్కడి పెద్దలు గుర్తు చేశారు. వర్షదేవత ప్రసన్నమై మంచి వర్షాలు కురిపిస్తారని విశ్వసిస్తూ ప్రతి ఏడాది అవసరమైతే ఇలాంటి సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఆధునిక కాలంలోనూ గ్రామీణ సంస్కృతి, స్థానిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే ఈ గాడిదల వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!