సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు అయిన సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి విషయంలో అయిన ఎంతో స్మార్ట్ గా ఉంటుంది ఇప్పుడు తాజాగా తన డాన్స్ తో అదరగొడుతోంది.ప్రేక్షకులలో అలాగే సోషల్ మీడియా లో సితార మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది. ఈ మధ్యనే టాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు డాన్స్ తో అదరగొట్టింది.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా క్షణాల్లో అది వైరల్ గా మారింది..సాయి పల్లవి పాటకు అద్భుతంగా డాన్స్ చేసి ప్రేక్షకులను సితార ఎంతగానో మెప్పించింది. ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది సితార.ఇప్పటి కే సితారకు రెండు మిలియన్స్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు.యూట్యూబ్లో సొంతం గా ఒక ఛానల్ కూడా ఆమె రన్ చేస్తోంది.ఈ మధ్యనే సితార కొరియోగ్రాఫర్ హనీ మాస్టర్ వద్ద డాన్స్ నేర్చుకుంటోందని సమాచారం.. ఈ క్రమంలో నే బాలీవుడ్ లోనూ టాలీవుడ్ లోనూ మంచి మంచి సాంగులకు డాన్సులు చేస్తూ సోషల్ మీడియా లో తెగ రచ్చ చేస్తుంది.
నాచురల్ బ్యూటీ సాయి పల్లవి చేసిన సారంగదరియా పాట కు అద్భుతమైన స్టెప్పులు వేసి అందరిని మెప్పించింది సితార. సితార లంగా వోనిలో సాయి పల్లవిని మరిపించేలా గా కనిపించింది. ఈ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రిన్సెస్ పాటకు డాన్స్ అదరగొట్టింది అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ ని చూసిన నమ్రత శిరోద్కర్ హార్ట్ ఎమోజిని పోస్ట్ చేసింది. అయితే చాలా మంది మహేష్ బాబు కూతురు త్వరలోనే సినీ ఫీల్డ్ లోకి అడుగు పెట్టేందుకు రెడీ చేస్తున్నారనే వార్తలు కూడ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది.మహేష్ తనయుడు గౌతమ్ కూడా సినిమాలలో నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వన్ నేనొక్కిడినే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం తెలిసిందే.