టెక్నాలజీ రోజు రోజుకు ఎంత పెరగిపోతున్నా.. ఇంకా కొందరు మూఢనమ్మకాలపైనే ఆధారపడుతున్నారు. అయితే.. ఇలాంటి వారిని ఆసరా చేసుకొని కొందరు దొంగ బాబాలు వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఫేక్ బాబాల నిర్వాకం వెలుగులోకి వచ్చినవే. అయితే.. అమాయక ప్రజలను మోసం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్న నకిలీ బాబాను అదుపులోకి తీసుకున్నారు యాదాద్రి జిల్లా ఎస్ఓటి పోలీసులు. మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో అనిల్ అనే వ్యక్తి స్థానికంగా కష్టాలలో ఉన్న అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని బాబా అవతారం ఎత్తి వారి వద్ద నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు.
Also Read : Wrestlers Protest: కేంద్ర ప్రభుత్వానికి రైతుల అల్టిమేటం.. బ్రిజ్ భూషణ్ అరెస్టుకు మే 21 గడువు
తనను నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుందని… ఏ కష్టం వచ్చినా తాను తీరుస్తానని ప్రజలను నమ్మించి మోసం చేసి వారి వద్ద నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ ఓ టి పోలీసులు సదరు నకిలీ బాబా అనిల్ ను తన ఇంట్లోనే భక్తులతో ఉన్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని మోటకొండూరు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అతని వద్ద నుండి కొంత నగదు, పూజా సామాగ్రి, తాయత్తులు, ఇతర సామాగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Road Accident: పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం