దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఇక సెకండ్ విడత శుక్రవారమే జరగనుంది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జార్ఖండ్ ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అయితే దీనిపై ప్రత్యుత్తరం ఇచ్చేందుకు తమకు రెండు వారాలు సమయం కావాలని ఈడీ కోరింది. అయితే ఈడీ నిర్ణయాన్ని సోరెన్ తరుపు న్యాయవాదులు కపిల్ సిబల్, అరుణాభ్ చౌదరి తప్పుబట్టారు. రెండు వారాల సమయం వల్ల తన క్లయింట్ ఎన్నికల ప్రచారానికి దూరం కావాల్సి వస్తుందని వాదించారు. ఇరుపక్ష వాదనలు విన్న కోర్టు.. హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్‌పై ప్రత్యుత్తరం ఇచ్చేందుకు ఈడీకి వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 1న చేపట్టనుంది.
ఇది కూడా చదవండి: Rishi Sunak: రువాండా బిల్లుకు బ్రిటన్ ఆమోదం.. ఐరాస ఆందోళన
మనీల్యాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను జనవరి 31న ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ను ఈడీ కస్టడీకి ఇవ్వడంతో విచారించింది. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో ఉంటున్నారు. ఆయన జైలుకు వెళ్లడంతో ఆయన స్థానంలో చంపయై సోరెన్ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుకున్నారు. ఇక హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ కూడా రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన మహా ర్యాలీలో కల్పనా సోరెన్ పాల్గొని కేంద్ర వైఖరిపై ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Prashanth Varma : జై హనుమాన్ లో మరిన్ని సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ చూస్తారు..
ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
ఇది కూడా చదవండి: Lok sabha election: 4 రాష్ట్రాలకు హీట్ వేవ్ ఎఫెక్ట్.. 26న పోలింగ్ తగ్గనుందా?